చిత్ర పరిశ్రమలో కొంత మంది నటీనటులు తమ వద్ద ఎప్పటి నుంచి పని చేస్తున్న వారి పట్ల ఎంతో ఉదారంగా ఉంటుంటారు.  వారి జీవితం సెటిల్ అయ్యేలా అన్ని చర్యలూ తీసుకుంటారు.  వారి శుభకార్యాలకు వెళ్లి సంతోష పరుస్తుంటారు.  తాజాగా బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా అలియా భట్ చేసిన పని అందరినీ ఆశ్చర్యపరిచియంది. ఈ నెల 15వ తేదీన ఆమె తన పుట్టినరోజు వేడుకను జరుపుకుంది.  ఈ సందర్భంగా ఆలియా ఓ సెన్సేషన్ నిర్ణయం తీసుకుంది.  


ఇటీవ‌ల త‌న బాయ్ ఫ్రెండ్ ర‌ణ్‌బీర్ క‌పూర్‌తో పాటు చిన్న‌నాటి ఫ్రెండ్స్‌తో బ‌ర్త్‌డే వేడుక జ‌రుపుకున్న అలియా, పుట్టిన రోజుకి ముందు త‌న డ్రైవ‌ర్‌తో పాటు స‌హాయ‌కుడికి కొంత‌ న‌గ‌దు బ‌హుమ‌తిగా ఇచ్చి ముంబై ప్రాంతంలో ఇల్లు కొనుక్కోమ‌ని చెప్పింద‌ట‌.  ఒక్కొక్క‌రికి 25 ల‌క్ష‌ల చెక్ అందించ‌గా సునీల్‌, అన్మోల్ ఇప్ప‌టికే జుహూ,ఖాన్ దండ‌లో హౌజ్ బుక్ చేసుకున్నార‌ని తెలుస్తుంది.   ఇద్దరి కోసం ఆమె అలా కోటి రూపాయలను ఖర్చు చేయడం బాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది.  


తన దగ్గర చాలా కాలంగా.. చాలా నమ్మకంగా పనిచేస్తోన్న ఈ ఇద్దరికీ నా పుట్టిన రోజు బహుమతి ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని ఆలియా అంటుంది. ఇటీవల రూ.7 కోట్లు ఖ‌రీదు ఉన్న ఓ ఫ్లాట్‌ని రూ.13.11 కోట్లకు కొని హాట్ టాపిక్‌గా మారింది. ఇక రీసెంట్‌గా ఆర్ఆర్ఆర్‌లో క‌థానాయిక‌గా ఎంపిక కావ‌డంతో ఈ అమ్మ‌డి పేరు మార్మోగిపోయింది. ప్ర‌స్తుతం బ్ర‌హ్మ‌స్త్రా, ఇన్షా అల్లా, క‌ళంక్‌, స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్ 2 చిత్రాల‌తో బిజీగా ఉంది అలియా


మరింత సమాచారం తెలుసుకోండి: