చాలామంది రాజకీయ పార్టీల నేతలు తాము స్పష్టంగా ఎక్కడ గెలుస్తామో అన్న విషయమై క్లారిటీ లేకపోవడంతో రెండు చోట్ల పోటీ చేయడం పరిపాటి. ఎన్టీఆర్ నుండి పవన్ కళ్యాణ్ వరకు ఈ సూత్రాన్ని అనుసరించారు. ప్రస్తుతం జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో పవన్ రెండు నియోజక వర్గాలు గాజువాక భీమవరంలో పోటీ చేస్తున్న విషయమై మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. 
 గాజు గ్లాసు
ఈ రెండు చోట్ల నామినేషన్ వేసిన తరువాత పవన్ మీడియాతో మాట్లాడుతూ ఈ రెండు ఊళ్ళను ప్రపంచస్థాయి నగరాలుగా మారుస్తానని మాటలు చెపుతున్నాడు. దీనితో ఆ ఊరి ప్రజలు నిజంగా పవన్ కు ఓటు వేసి రెండు చోట్లా గెలిపించేలా సహాయం చేస్తే పవన్ ఈ రెండు అసెంబ్లీ స్థానాలలో ఏదో ఒక దానిని వదులుకోవలసి ఉంటుంది.  

అయితే ఎన్నికల తరువాత ఈ రెండిటిలో ఒక స్థానాన్ని పవన్ వదులుకుంటే తమ ఊరు ప్రపంచ స్థాయి నగరంగా మారిపోతుంది అని భావించిన భీమవరం గాజువాక ప్రజల ఆశలు ఎలా నెరవేరుతాయి అంటూ పవన్ పై కొందరు సెటైర్లు వేస్తున్నారు. అంతేకాదు పవన్ కు ఏ విషయం అయినా ఒకటి కంటే ఎక్కువ కావాలని అది పెళ్ళిళ్ళు అయినా ఎన్నికలలో నియోజక వర్గాలు అయినా పవన్ కు సమానమే అంటూ మరికొందరు జోక్ చేస్తున్నారు. 
Please-Be-Responsible,-Pawan-Kalyan!
అదేవిధంగా పవన్ రెండుచోట్ల పోటీ చేస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ రెండుచోట్లా పవన్ గెలిస్తే మరోసారి విడాకులు గ్యారెంటీ అంటు పవన్ వ్యక్తిగత జీవితాన్ని గుర్తు చేస్తూ మరికొందరు విమర్శలు చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా పవన్ నిన్న తన ఎన్నికల ప్రచారంలో మండుతున్న ఎండలో రోడ్డు పక్కన తాటాకు చాప పై కూర్చుని మట్టి ప్లేట్ లో భోజనం చేస్తున్న ఫోటో వైరల్ గా మారింది. కేవలం ఇలాంటి యాక్టింగ్ స్టిల్స్ ప్రజలు చేత ఓట్లు వేయిస్తాయా అంటూ విమర్శలు వస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: