తెలుగు తెరపై తెలుగమ్మాయిల సంఖ్య చాలా తక్కువ. ఎంతసేపూ పరభాషా హీరోయిన్లతోనే మన డైరెక్టర్లకు కిక్ ఉంటుంది. అందాల ప్రదర్శనకు అడ్డుచెప్పరనో.. మనవాళ్లకు టాలెంట్  లేదనో.. అంత మోడ్రన్ గా కనిపించరనో ఏమో గానీ.. తెలుగు అమ్మాయిలకు తెలుగు తెర అంతగా ఇంపార్టెన్స్ ఇవ్వదు. 


ఇదే సమయంలో  ఏం.. మా అనంతపురం అమ్మాయిలు అందంగా ఉండరా అంటూ తెలుగు తెరపైకి దూసుకొచ్చందిప్రియాంక జవాల్కర్‌. పేరు చూసి ఎక్కడి అమ్మాయి అనుకోకండి. అచ్చ తెలుగు అనంతపురం ఆడబిడ్డ. టాక్సీవాలా సినిమాతో ఎంట్రీతోనే హిట్ కొట్టేసింది. ఉత్తరాది భామలకు దీటుగా క్రేజ్ సంపాదించింది. 



మరి పేరేంటీ జువాల్కర్ అని ఉంది అంటారా.. ప్రియాంక వాళ్లది వాస్తవానికి  మహారాష్ట్రకు చెందిన మరాఠా కుటుంబం. ఒక తరం నుంచి అనంతపురంలో స్థిరపడ్డారు. ప్రియాంక పుట్టింది, పెరిగింది ఇక్కడే. అందుకే ఇండస్ట్రీలో, సోషల్‌ మీడియాలో.. ఆమెన అనంతపురం పిల్ల అని పిలుస్తున్నారు. 



ఇంజినీరింగ్‌ చేసిన ఈ అమ్మడు ఆ తర్వాత సినిమాలపై ఆసక్తి పెంచుకుంది. నిఫ్ట్‌లో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ చేస్తూ సినిమాలపై దృష్టి పెట్టింది. కొన్ని షార్ట్ ఫిల్మ్స్ లో నటించింది. ఆ తర్వాత టాక్సీవాలాలో ఛాన్స్ దొరికింది. ఆ తర్వాత ఏమైందో మీ అందరికీ తెలిసిందే.. తెలుగమ్మాయిలకి పరిశ్రమ నుంచి, ప్రేక్షకుల నుంచి లభించే ప్రోత్సాహమే వేరంటోంది ప్రియాంక. 



మరింత సమాచారం తెలుసుకోండి: