‘ఎఫ్ 2’ మూవీ తరువాత టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పటి వరకు రియల్ హిట్ అని చెప్పుకోతగ్గ ఒక్క సినిమా కూడ విడుదల కాలేదు. వారానికి రెండు మూడు సినిమాలు విడుదల అవుతున్నా వాటిలో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాలు కూడ కలక్షన్స్ విషయంలో చతికలు పడిపోతున్నాయి.
Suryakantham,Nikarika Konidela,Suryakantham movie
ప్రస్తుతం టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో కరువు ఏర్పడిందా అంటూ కామెంట్స్ కూడ వస్తున్నాయి. ఇలాంటి పరిస్థుతులలో ఈవారం విడుదల కాబోతున్న నిహారిక ‘సూర్యకాంతం’ కు ప్రస్తుతం వేడెక్కిస్తున్న ఎన్నికల వాతావరణం అదృష్టంగా మారుతుందా అన్న కోణంలో చర్చలు జరుగుతున్నాయి. 
First look of Niharika’s ‘Suryakantham’ is out
వాస్తవానికి ఈసినిమాకు చెప్పుకోతగ్గ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరగకపోయినా ఇప్పటికే విడుదలైన ఈమూవీ ట్రైలర్స్ కు మంచి స్పందన రావడంతో పాటు నిహారిక ఈమూవీని చాల గట్టిగా ప్రమోట్ చేస్తున్న నేపధ్యంలో ఈమూవీ మోడరేట్ హిట్ గా మారీ ఆస్కారం ఉంది అంటూ ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. ఈసినిమాకు పోటీగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదల అవుతున్నా మల్టీ ప్లేక్స్ ఆడియన్స్ అదేవిధంగా ఫ్యామిలీ ప్రేక్షకులు యూత్ కూడ నిహారిక కే ఓటు వేస్తారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 
Teaser: Niharika Konidela Shines As Suryakantham
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ భారీ స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చినా ఆసినిమాలో వర్మ ఏమి తీసాడో అందరికీ తెలిసిన తరువాత ఆమూవీ కలక్షన్స్ డ్రాప్ అయ్యే ఆస్కారం ఉంది. అయితే ఓపెనింగ్స్ విషయంలో ‘సూర్యకాంతం’ వెనకపడినా పాజిటివ్ టాక్ తెచ్చుకోకలిగితే ఈమూవీ నెమ్మదిగా బలపడి ఉగాదికి రాబోతున్న ‘మజిలీ’ విడుదల వరకు నిహారిక హవా కొనసాగే ఆస్కారం ఉంది. అయితే ఇది అంతా తన ధియేటర్స్ కు వచ్చిన ప్రేక్షకులను నవ్వించడంలో ‘సూర్యకాంతం’ సమర్ధత పై ఆధారపడి ఉంటుంది. మరి ఈ అవకాశాన్ని నిహారిక ఎలా అందుకోగలుగుతుందో చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: