ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు ప్రతీ ప్రముఖ పార్టీకి జీవన్మరణ సమస్యగా మారడంతో ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు ప్రతి చిన్న విషయాన్ని తమ ప్రచారానికి అనువుగా మార్చుకుని ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఈఎన్నికల ప్రచారంలో మహేష్ బాబు 'జీఎస్టీ' వివాదం కూడ ప్రస్తావనకు రావడం హాట్ టాపిక్ గా మారింది. 
మహేష్ బాబు జీఎస్టీ వివాదం ఏమిటి?
ఆసక్తికరమైన ఈ న్యూస్ వివరాలలోకి వెళ్ళితే గుంటూరు నుంచి లోక్ సభకు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్న మహేష్ బావ గల్లా జయదేవ్ తన ఎన్నికల ప్రచారంలో తన బావమరిది మహేష్ బాబు ప్రస్తావన తీసుకొచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా తాను లోక్ సభలో మాట్లాడటం వల్లే తనను టార్గెట్ చేయడమే కాకుండా తన బంధువులను  స్నేహితులను టార్గెట్ చేశారని మహేష్ బాబుకుపై ఐటీ దాడులు జరుగడం  జీఎస్టీ వివాదం వెనక కారణం అదే అంటూ జయదేవ్  కామెంట్స్ చేసారు. 
వెనక్కి ఇచ్చేశారు
అయితే ఈఎన్నికల ప్రచారంలో మహేష్ బాబు జీఎస్టీ ఇష్యూను తెరపైకి తీసుకురావడం వెనుక మహేష్ అభిమానుల   ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మహేష్ బాబుకు చెందిన ఏఎంబీ సినిమాస్‌ థియేటర్‌ లో ప్రేక్షకుల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేసినట్లు ఈ ఏడాది ఫిబ్రవరి ఆరోపణలు వచ్చిన విషయం  తెలిసిందే. ఈవ్యహారంలో ‘ఎఎంబి సినిమాస్'  యాజమాన్యం  పాత జీఎస్టీ రేట్లనే కొనసాగించడం వల్ల అదనంగా 35.66 లక్షలు వసూలు చేశారు అన్న ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. 
జీఎస్టీ కమీషనరేట్ ప్రశంసలు
దీనితో మహేష్ సూచనలతో  జీఎస్టీ రూపంలో అదనంగా వచ్చిన 35.66 లక్షలు తిరిగి ఇచ్చేయాలని నిర్ణయ ఇవ్వడమే కాకుండా ఆ మొత్తాన్ని వినియోగదారుల సంక్షేమ నిధికి చెల్లించారు. ఈ విషయం సర్దుమణిగి చాలరోజులు అయిపోయినా మహేష్ బావ జయదేవ్ చాలా వ్యూహాత్మకంగా మహేష్ పేరును తన ప్రచారంలో ఉపయోగించడం హాట్ టాపిక్ గా మారింది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: