దక్షిణాదిలోని పద్నాలుగు సంవత్సరాలుగా అప్రతిహతంగా స్టార్-హీరోయిన్లలో ఒకరుగా దేదీప్యంగా వెలుగులు చిమ్మిన మిల్కీ బ్యూటీ తమన్నాకు ప్రస్తుతం టాలీవుడ్ లో అవకాశాలు తగ్గిపోయాయి. ‘బాహుబలి’ లాంటి భారీ చిత్రంలో అవంతికా ఏంతో గ్లామర్ ఒలకబోస్తూ నటించినా, ‘F2’తో బ్లాక్-బస్టర్ రికార్డ్ హిట్టుకొట్టినా తమన్నాకు మాత్రం పెద్దగా ప్రయోజనం కలగలేదు. గతయేడాది ప్రారంభమైన “క్వీన్” తెలుగు రీమేక్ “దటీజ్ మహాలక్ష్మి”  ఇంకా నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటూనే ఉంది. 
milky beauty tamanna bhatiya కోసం చిత్ర ఫలితం
ప్రస్తుతం ఆమెచేతిలో ఉన్న తెలుగుసినిమా ‘సైరా నరసింహారెడ్డి’ ఒక్కటంటే ఒక్కటే. సినిమాల విషయంలో తమన్నా వెనకబడినా ఏమాత్రం అమెకున్న అభిమానుల ఫాలోయింగ్  తగ్గలేదు. ఆమె ఇంకా పోటీలోనే ఉండటానికి కారణం ఆమె చేస్తోన్న కామెంట్సే!  సినిమాల్లో లిప్‌లాక్‌లకు తాను దూరమని ఇప్పటికే ప్రకటించిన తమన్నా, బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌తో అయితే మాత్రం ముద్దు కు సిద్ధం అని నవ్వుతూ చెప్పింది. అంతేకాదు బాలీవుడ్‌ నటుడు విక్కీ కౌశల్‌ తో మాత్రం డేటింగ్‌కు వెళ్లాలనేది తన కోరికగా చెపుతుంది. 
milky beauty tamanna bhatiya కోసం చిత్ర ఫలితం
ఇటీవల ఓ ఇంగ్లిష్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘డేటింగ్‌కి వెళ్లే అవకాశం వస్తే ఎవరితో వెళ్తారు?’ అని అడిగిన ప్రశ్నకు తమన్నా తడుముకోకుండా ఠక్కున విక్కీ కౌశల్‌ అని సమాధానం చెప్పింది.   
tamanna erotic కోసం చిత్ర ఫలితం
‘ఉరి: ది సర్జికల్‌ స్ట్రయిక్‌’ చిత్రంలో విక్కీ తన నటనతో ఫిదా చేసేశారని వెల్లడించింది.  ఆ తరవాత మీటూ ఉద్యమం గురించి మాట్లాడుతూ ‘ఎవరెవరో ఏవేవో ఆరోపణ లు చేస్తుంటారు. కేవలం తమకు ఎదురైన అనుభవాల గురించి చర్చించు కోవడానికే మీటూ ఉద్యమం ఉంది. వాటి గురించి మాట్లాడాలంటే చాలా ధైర్యం కావాలి. కానీ ఒక్కోసారి ఇదేదో ఆటలా మారిపోయిందని అనిపిస్తోంది. ఈ ఉద్యమాన్ని మరింత సీరియస్‌గా తీసుకుని ఉంటే చిత్ర పరిశ్రమలో ఎలాంటి మార్పులు చూడాలను కుంటున్నామో అవి చూసేవాళ్లం’ అని వెల్లడించింది. 
vicky kaushal tamanna కోసం చిత్ర ఫలితం
దక్షిణాదిలో కాస్త అవకాశాలు తగ్గడంతో తమన్నాబాలీవుడ్ వైపుచూస్తోంది. ఈ మిల్కీ-బ్యూటీ ఇప్పటికే రెండు మూడు హిందీ సినిమాల్లో నటించింది. వీటిలో చెప్పుకోదగిన చిత్రం అజయ్ దేవగణ్ ‘హిమ్మత్‌వాలా’. 
tamanna likes to kiss hritik కోసం చిత్ర ఫలితం
తాజాగా మరో హిందీ సినిమాను అంగీకరించినా అది ఇంకా పట్టాలెక్కలేదు. వాస్తవానికి తమన్నా వెండితెరకు పరిచయమైంది బాలీవుడ్ ద్వారానే. 15ఏళ్ల వయసులోనే ‘యే చంద్ సా రోషన్ చెహ్రా’ అనే హిందీ సినిమాలో నటించింది. ఆ తరవాత దక్షిణాదికి వచ్చి స్టార్ హీరోయిన్ హోదా సంపాదించింది. ప్రస్తుతం తెలుగులో ‘సైరా’తో పాటు తమిళంలో ‘దేవి 2’లో నటిస్తోంది. ‘దేవి 2’ తెలుగులో ‘అభినేత్రి 2’గా రానుంది. హేపీడేస్, బాహుబలి టాలీవుడ్ లో తమన్నా కు కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి.

సంబంధిత చిత్రం

మరింత సమాచారం తెలుసుకోండి: