తెలుగు ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకు పోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’చిత్రంలో నటిస్తున్నారు.  ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం షరవేగంగా జరుపుకుంటుంది.  అయితే ఎన్టీఆర్ ఎంత షూటింగ్ బిజీలో ఉన్నా తన కుటుంబ సభ్యులతో కొంత సమయం కేటాయిస్తూ సంతోషంగా గడుపుతుంటారు. 

నటుడు రానా ‘అమర చిత్ర కథ’ పేరుతో చిన్నారుల కోసం ప్రత్యేక శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.  దీనికి సంబంధించిన కార్నివాల్ రామానాయుడు స్టూడియోలో ఈ నెల 31న సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయంటూ కామెంట్ చేస్తున్నారు. తన సంతోషాన్ని తన కొడుకుతో పంచుకుంటున్నాడు. 

అంతే కాదు ‘అమర చిత్ర కథ’ పుస్తకాలను షేర్ చేసి రానాకు ధన్యవాదాలు తెలిపారు. ‘నాకు చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయి. అమర చిత్ర కథ కామిక్స్‌ నిధి దొరికినందుకు, నా చిన్ననాటి జ్ఞాపకాలను అభయ్‌తో పంచుకునేందుకు అవకాశం కల్పించిన రానా దగ్గుబాటికి ధన్యవాదాలు’ అని తారక్ ట్వీట్‌లో పేర్కొన్నాడు.  కాగా,  శిక్షణ కేంద్రంలో చిన్నారులకు ఆర్ట్, డిజైన్, జీవన నైపుణ్యాలు, వేదిక్ సైన్స్‌పై శిక్షణ ఇవ్వనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: