అందరూ ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న రాంగోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.  మొదటి నుంచి వర్మ ఈ చిత్రం ఎన్టీఆర్ ఆశిస్సులతో తీస్తున్నాను..ఎన్ని అడ్డంకులు వచ్చినా రిలీజ్ చేస్తానని చెబుతూ వచ్చారు.  అయితే వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం చుట్టూ అల్లుకున్న వివాదాలు అన్నీ ఇన్నీ కావు.  మొత్తానికి ఎన్నికల కోడ్ కారణంగా ఏపీలో ఈ చిత్రం విడుదల వాయిదా పడగా, తెలంగాణ సహా ఓవర్సీస్‌లో చిత్రం యథావిధిగా విడుదల అయ్యింది. అమెరికాలో ప్రీమియర్ షో చూసిన కొందరు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడించారు. 

ఎన్టీఆర్‌ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చినట్టు చెబుతున్న విషయాన్ని ప్రధానాంశంగా తీసుకుని ఈ చిత్రంలో ఆయన కష్టాలను కళ్లకు కట్టినట్లుగా చూపించారని అంటున్నారు.  తొలి అర్ధభాగంలో లక్ష్మీపార్వతి  ఎక్కువగా ఫోకస్ చేసినట్లు ఉందని కొందరు అంటున్నా...ఎన్టీఆర్ జీవితంలోకి ఆమె ఎంట్రీ విషయాన్ని చాలా చక్కగా చూపించారని అంటున్నారు.  ఎన్టీఆర్-లక్ష్మీ పార్వతి సన్నివేశాలు తప్ప ఫస్టాఫ్‌లో బాగానే కవర్ చేశారని టాక్. ఎన్టీఆర్-లక్ష్మీపార్వతి మధ్య నడిచిన కొన్ని సెంటిమెంట్స్ సీన్లు ఆకట్టుకునేలా చూపించారని అంటున్నారు.

ఈ చిత్రానికి కల్యాణ్ మాలిక్ అందించిన సంగీతం బాగుందని కొనియాడుతున్నారు. చంద్రబాబు సన్నివేశాలు ఆకట్టుకోలేదని కొందరు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.  ఎన్టీఆర్ పాత్రలో పి.విజయ్ కుమార్ అత్యద్భుతంగా నటించాడని.. శ్రీ తేజ్ పాత్ర కూడా చాలా అద్భుతంగా మలిచారని..కొన్నీ సీన్లు చాలా ఎమోషనల్ గా కవర్ చేశారని అంటున్నారు.  లక్ష్మీపార్వతి పాత్రలో యజ్ఞాశెట్టి అద్భుతంగా నటించిందని చెబుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: