నందమూరి తారక రామారావు యావత్ తెలుగు దేశం గర్వించదగ్గ నాయకుడు! కష్టేఫలి అనే దానికి నిలువెత్తు నిదర్శనం.  ప్రతి తెలుగు వారు ఆయన మరణించిన ఇన్ని దశాబ్దాల తరువాత కూడా ‘రామారావు గారు మా తెలుగు వారే’ అని గర్వంగా చెప్పకుంటున్న మనిషి.  ఇక సంచలన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ - నిర్మాత రాకేష్ రెడ్డి సినిమా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఈ రోజు విడుదలయింది. 

రామ్ గోపాల్ వర్మ గత పదేళ్లుగా వివిధ  విమర్శలను ఎదుర్కొంటున్నారు.  అంతే కాదు కొంత కాలంగా పేలవమయిన సినిమాలు తీస్తూ జనాలమీదకు వదులుతున్న విషయం తెలిసిందే.  దాంతో అసలు వర్మకు ఏమైందీ..ఇలాంటి సినిమాలు తీస్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు సినీ ప్రియులు. 


అయితే ఈ రోజు విడుదల ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ శివ సినిమా తీసిన రామ్ గోపాల్ వర్మని గుర్తు చేసిందంటున్నారు  సినీ విమర్శకులు. సినిమా మేకింగ, ఎన్టీఆర్ గంభీఅరత్వాన్ని చెదగొట్టకుండా ఆయన మానసిక సంఘర్షలను కళ్లకు కట్టినట్లుగా చూపించారు.  ఎటువంటి ఒత్తిళ్లకూ భయపడకుండా రామారావు గారి కుటుంబ పరిస్థితిని తెరకెక్కించడంతో పాటు, సామాన్య జనాలకు ఇది కదా ఎన్టీఆర్ అంటూ అనుకునేట్టు చేయడంతో ఘన విజయాన్ని సాధించారు ఆర్జీవి.

ఎన్టీఆర్ గారి మీద చెప్పులు విసిరిన సందర్భంలో ఎన్టీఆచ్ గారు చెప్పే డైలాగ్స్ చేంపేశ్శార్రా...చెప్పులు విసిరి నేను కన్నవాళ్లు, నేను తయాచు చేసిన వాళ్లే నన్ను చంపేశ్శార్రా అన్నపుడు గుండెలు బరువెక్కితాయి, కళ్ల వెంట నీరు మనకు తెలియకుండానే బయటకురుకుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: