తెలుగు దేశం పార్టీ.. తెలుగువారి ఆత్మ గౌరవం కోసం పెట్టిన పార్టీ.. తెలుగువారి జీవితాల్లో వెలుగు నింపడానికి పెట్టిన పార్టీ.. సరిగ్గా 37 ఏళ్ల క్రితం నందమూరి తారక రామారావు సగర్వంగా స్థాపించిన పార్టీ.. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే కళ్లు చెదిరే విజయాలు.. జనజీవితాన్ని సమూలంగా మార్చి వేసిన ఘన చరిత్ర తెలుగుదేశం సొంతం.


తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున హైదరాబాద్‌లో పురుడుపోసుకుంది. హైదరాబాద్ నుంచి హస్తిన వరకూ ప్రస్థానం సాగించి ఏకంగా ఢిల్లీ పెద్దల గద్దెలను వణికించింది. కానీ ఇప్పుడు తాను పుట్టిన గడ్డపై దాదాపు పార్టీ సమాధికి సిద్ధమైంది. 

తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఎన్నడూ ఎన్నికలకు దూరంగా లేదు. గెలుపైనా ఓటమైనా.. చావోరేవో అన్నట్టు పోరాడింది. కొన్నిసార్లు విజయాలు హృదయం ఉప్పొంగించాయి. మరికొన్నిసార్లు పరాజయాలు పలకరించాయి. కానీ పోరాటం మాత్రం ఆగలేదు. కానీ .. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పోటీకి దూరంగా ఉంది. 

పార్టీ తరపున పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రాక.. ఎవరైనా పోటీ చేస్తామని వచ్చినా.. ఎందుకు ప్రచారం ఖర్చులు దండగ అని అధిష్టానం భావించిందో ఏమో కానీ.. పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదటిసారి 37 ఏళ్ల తర్వాత.. పార్లమెంటు ఎన్నికలకు దూరమైంది. కనీసం పోటీ కూడా చేయలేని స్థితికి చేరింది. తెలుగుదేశం కంటే కమ్యూనిస్టులు నయం.. గెలిచినా గెలవకపోయినా పోటీ చేస్తుంటారు అని జనం అనుకునే తెలుగుదేశం దుస్థితి చూస్తే ఎన్టీఆర్ ఆత్మ క్షోభించదా.. ! 



మరింత సమాచారం తెలుసుకోండి: