ఈ సంవత్సరం సమ్మర్ రేస్ పోటీ మహేష్ విజయ్ దేవరకొండల మధ్య మాత్రమే ఉంటుంది. దీనికితోడు వీరిద్దరి సినిమాలు మే నెలలో విడుదల అవుతున్న నేపధ్యంలో వీరిద్దరిలో ఎవరు సమ్మర్ రేస్ విజేత అవుతారు అన్న విషయమై ఆసక్తికర అంచనాలు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్నాయి. 

ఇలాంటి పరిస్థుతులలో మరి కొద్ది రోజులలో జరగబోతున్న ఎన్నికలు డియర్ కామ్రేడ్ మూవీ బిజినెస్ పై ప్రభావం చూపించి ఆ మూవీకి రావలసిన లాభాలను తగ్గించాయి అంటూ ఇండస్ట్రీ వర్గాలలో గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు డియర్ కామ్రేడ్ మూవీని మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించినా ఆ మూవీకి ఫైనాన్స్ చేసింది ఆంధ్రప్రదేశ్ లోని ఒక ప్రముఖ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ ఫైనాన్షియర్ అని తెలుస్తోంది.

అయితే ఈ ఎన్నికలలో ఆ ఫైనాన్షియర్ సన్నిహితులు కొంతమంది ఎన్నికలలో పోటీ చేస్తున్న నేపధ్యంలో తాను మైత్రీ మూవీస్ సంస్థకు ఇచ్చిన భారీ మొత్తాన్ని వెంటనే కావాలి అని ఒత్తిడి చేసినట్లు టాక్. దీనితో మైత్రీ మూవీస్ నిర్మాతలు హడావిడిగా డియర్ కామ్రేడ్ బిజినెస్ ను క్లోజ్ చేయడంతో ఈమూవీకి క్రేజ్ ఉన్నా అనుకున్న రేట్లకన్నా తక్కువ రేటుకు ఈమూవీని అమ్మవలసిన పరిస్థితి ఏర్పడింది అంటూ గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి.

వాస్తవానికి ఈమూవీ టీజర్ విడుదలైన తరువాత ఆ టీజర్ లోని లిప్ లాక్ సీన్స్ చూసి ఈమూవీ మరొక ‘అర్జున్ రెడ్డి’ అవుతుందా అంటూ అంచనాలు మొదలయ్యాయి. దీనితో ఈమూవీ పై బయ్యర్లలో బాగా ఆసక్తి పెరిగి పోయింది. దీనికితోడు విడుదలకు సమయం ఉండటంతో నెమ్మదిగా మంచి రేట్లకు ఈసినిమాను అమ్ముదామని మైత్రీ మూవీస్ నిర్మాతలు భావించినట్లు తెలుస్తోంది. అయితే అనూహ్యంగా ముంచుకు వస్తున్న ఎన్నికలు ‘డియర్ కామ్రేడ్’ కు శాపంగా మారాయి అంటూ ఇండస్ట్రీ వర్గాలలో కొందరు సెటైర్లు వేస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: