నాగ చైతన్య, సమంత.. చూడచక్కని జంట.. తెరపై మొదలైన ప్రేమను జీవితంలోనూ కొనసాగించిన జంట. ప్రేమను గెలిపించుకున్న అరుదైన సినీ జంట. నాగచైతన్య  తండ్రి బాటలోనే ప్రేమవివాహం చేసుకున్న  సంగతి తెలిసిందే. 


కానీ అది అంత సులభంగా ఏమీ జరగలేదట. సమంతను పెళ్లి చేసుకుంటానని ఇంట్లో చెప్పడానికి భయమేసిందట. విషయం చెప్పగానే నాగార్జన అడిగిన ప్రశ్న ఒక్కటే.. అదే సమంతనే ఎందుకు చేసుకుంటావ్‌? అని.. చేసుకుంటే మీ ఇద్దరూ హ్యాపీగా ఉండగలరా? అని అడిగారట నాగార్జున. 

తండ్రి ప్రశ్నలకు నాగ చైతన్య సరిగ్గా సమాధానం చెప్పగలిగారట. తండ్రి వేసిన ఆ ప్రశ్న తనను తాను సమాధాన పరచుకోవడానికీ, భవిష్యత్తుపై నమ్మకం కలగడానికి ఉపయోగపడిందట. తల్లిదండ్రులకు కొన్ని భయాలు ఉంటాయని.. వాటిని తొలగిస్తే ప్రేమకు వారు అడ్డుచెప్పరని అంటున్నాడు చైతూ. 

నాగ చైతన్య సమంతని డైరెక్ట్‌గా తీసుకెళ్లి.. మీ కోడలు అని పరిచయం చేయలేదు. ముందుగా లంచ్‌కీ, ఇంట్లో జరిగే పార్టీలకీ తీసుకెళ్లాడట. అలా మా ఇంటినీ, ఇంట్లో వాతావరణాన్ని, మనుషుల్నీ సమంతకు మెల్లమెల్లగా పరిచయం చేశాడట. ఆ తర్వాత అసలు విషయం చెప్పి తల్లిదండ్రుల్ని ఒప్పించాడట చైతూ. అమ్మ చైతూ.. తక్కువ వాడేం కాదు.



మరింత సమాచారం తెలుసుకోండి: