ప్రియాంక. ఇండియాలో బాలీవుడ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక చోప్రా అమెరికన్ థ్రిల్లర్ సీరీస్ క్వాంటికోతో అక్కడికి వారికి కూడా దగ్గరైంది. ఆ హాలివుడ్ పరిచయంతోనే అక్కడి నటుడు గాయకుడు నిక్‌ను ఇటీవలే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 


నిక్ తన కంటే పదేళ్లు తక్కువ వయస్సు కావడం విశేషం. పెళ్లిలోతనను వెడ్డింగ్ డ్రెస్‌లో చూడగానే నిక్‌ ఏడుపు ఆపుకోలేకపోయాడంటూ తీపిజ్ఞాపకాలు కూడా పంచుకుంది ప్రియాంక. అయితే ఇంతలోనే మరోబ్యాడ్ న్యూస్ వినిపిస్తోంది  పెళ్లై పట్టుమని మూడు నెలలు కూడా కాలేదు.. 

అప్పుడే వీరిద్దరూ విడాకులకు సిద్ధమవుతున్నారంటూ ఓ అంతర్జాతీయ మీడియా ప్రచురించిన కథనం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ సినీజంటకు ఒక్క క్షణం కూడా పడడం లేదని, ప్రతీ విషయానికి గొడవ పడుతున్నారట. తొందరపడి ఒక్కటైన వీరిద్దరూ ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారని ఆ పత్రిక తన కథనంలో కామెంట్ చేసింది. 

పెళ్లి తర్వాత ప్రియాంక స్వభావం మారుతుందని నిక్ ఫీలవుతున్నాడట. పోనీలే.. ప్రియాంక త్వరలోనే మారుతుందని నిక్ భావించాడని, కానీ ఆమె ప్రవర్తనలో మార్పు లేకపోవడంతో నిక్ ఆవేదన చెందుతున్నాడని ఆ కథనం చెబుతోంది. అయితే ఇది గాసిప్ న్యూసేనా.. ఇందులో వాస్తవం ఉందా.. లేదా అన్నది త్వరలో తేలాల్సిఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: