నాగార్జున నటించిన ‘మన్మధుడు’ 2002 లో విడుదలై అతడిని వెండితెర మన్మధుడుగా మార్చింది. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈమూవీ నాగ్ మూవీలలో ఒక క్లాసిక్ మూవీగా పేర్కొంటారు. ఇప్పుడు ఈసినిమాకు సంబంధించి సీక్వెల్ ‘మన్మధుడు 2’ పేరుతో 59 సంవత్సరాల వయస్సుగల నాగార్జున పై తీస్తున్నారు. 

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈమూవీ పై సుమారు 40 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు సమాచారం. ఇలాంటి పరిస్థుతులలో ఈమూవీకి సంబంధించి ఒక షాకింగ్ నిర్ణయం నాగార్జున తీసుకున్నట్లు టాక్. ఈమూవీకి సంబంధించిన కథ రీత్యా ఈసినిమాలో రెండు భారీ యాక్షన్ సీన్స్ ఉండేలా దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఇచ్చిన యాక్షన్ ప్లాన్ కు నాగార్జున నో చెప్పినట్లు టాక్.

‘మన్మధుడు 2’ లో ఒక్క యాక్షన్ సీన్ కూడ పెట్టవద్దనీ సినిమాను అంతా పూర్తి కామెడీ సీన్స్ తో నింపమని సినిమా మొదలైన దగ్గర నుండి ముగిసే వరకు ప్రేక్షకులు అన్నీ మరిచిపోయి హాయిగా నవ్వుకునే సీన్స్ మాత్రమే క్రియేట్ చేయమని నాగ్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లు టాక్. దీనితో ‘మనమధుడు 2’ మరో ‘ఎఫ్ 2’ గా మారుతుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. 

ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచి మారిపోయి ఎక్కువగా హాస్య సన్నివేశాలు కోరుకుంటున్న నేపధ్యంలో నాగార్జున ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనికితోడు ఈమధ్య కాలంలో నాగ్ నటించిన సినిమాలు అన్నీ ఫెయిల్ అయిన నేపధ్యంలో మరో ప్రయోగం చేయడం ఇష్టం లేక ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ను ఆధారంగా చేసుకుని నాగ్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: