సినిమాలు వదిలి రాజకీయాల బాటపట్టిన పవన్ ప్రస్తుతం తన దగ్గర ఎలాంటి ఆస్తులు లేవని చెపుతున్న నేపధ్యంలో పవన్ కల్యాణ్ కు సినిమాలు చేయకుండా ఎలాడబ్బు వస్తుందో వివరించాలని రాజశేఖర్ దంపతులు చేసిన కామెంట్స్ కలకలం సృట్టిస్తున్నాయి. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ విజయం కోసం తీవ్రంగా ప్రచారం చేస్తున్న జీవిత రాజశేఖర్ లు ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ ఈవిధంగా కామెంట్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 

పవన్ సినిమాలు వదిలి రాజకీయాల బాట పట్టి ప్రజలకు మంచి చేయాలి అన్న ఉద్దేశ్యం మంచిదే అయినప్పటికీ ప్రస్తుత ఎన్నికలలో ‘జనసేన’ పార్టీ ఖర్చు పెడుతున్న డబ్బు ఎక్కడిది అన్న విషయం పవన్ క్లారిటీ ఇవ్వాలని వీరిద్దరూ డిమాండ్ చేసారు. అంతేకాదు తన జీవితం అదేవిధంగా తన పార్టీ పూర్తి పారదర్శకంగా ఉంటుంది అని చెప్పుకునే పవన్ ప్రతి విషయంలోనూ క్లారిటీగా అతడి ఇమేజ్ మరింత పెరుగుతుంది అంటూ అభిప్రాయపడుతున్నారు జీవితా రాజశేఖర్. 

ఇదే సందర్భంలో రాజశేఖర్ మరో ట్విస్ట్ ఇస్తూ రాబోతున్న ఎన్నికల ఫలితాల తరువాత పవన్ తాను కాబోయే ముఖ్యమంత్రిని అని చెప్పుకోవడం ఆశ్చర్యంగా ఉంది అంటూ కేవలం 65 స్థానాలలో పోటీ చేస్తున్న పవన్ ఎలా ముఖ్యమంత్రి కాగలడు అన్న సందేహం జీవిత రాజశేఖర్ వ్యక్త పరుస్తున్నారు. ప్రస్తుతం వీరి కామెంట్స్ మీడియాకు హాట్ టాపిక గా మారాయి. 

ఇప్పటి వరకు పవన్ ను కానీ ‘జనసేన’ ను కాని పట్టించుకోని అనేక ప్రముఖ న్యూస్ ఛానల్స్ అదేవిధంగా అనేక ప్రముఖ తెలుగు దిన పత్రికలు తమ పతాక శీర్షికలలో పవన్ ఉపన్యాసాలను కవర్ చేస్తూ యూటర్న్ తీసుకోవడం అత్యంత ఆశ్చర్యకరంగా మారింది. దీనితో నిజంగానే రాబోతున్న ఎన్నికల ఫలితాల తరువాత పవన్ తాను కోరుకున్నట్లుగా కింగ్ మేకర్ కాబోతున్నాడా అన్న సందేహాలు కలుగుతున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: