‘ఆర్ ఆర్ ఆర్’ విషయంలో రాజమౌళి అనుకున్నట్లుగా ఏదీ జరగడం లేదు. ఈమూవీకి సంబంధించి ఉత్తర భారతదేశంలో చరణ్ జూనియర్ అలియా భట్ లపై కొన్ని కీలక సన్నివేశాలు తీయాలని రాజమౌళి వేసుకున్న ప్లాన్ చరణ్ కు జరిగిన ప్రమాదం వల్ల క్యాన్సిల్ అయింది.

దీనితో వచ్చేనెల వరకు ఈమూవీ షూటింగ్ ఉండకపోవడమే కాకుండా మళ్ళీ వచ్చేనెల ఈ షెడ్యూల్ ప్లాన్ చేయాలి అంటే అలియా భట్ డేట్స్ సమస్య. ఇప్పుడు ఇది చాలదు అన్నట్లుగా ఈమూవీలో జూనియర్ పక్కన హీరోయిన్ గా నటించబోతున్న బ్రిటీష్ బ్యూటీ డైసీ ఎడ్గర్ జోన్స్ ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రాజెక్ట్ నుండి తప్పకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 

వాస్తవానికి ఈమెను ఒక లండన్ లోని ఒక ఛానల్ లో ప్రసారం అయిన ఒక ఇంగ్లీష్ సీరియల్ లో ఈమె అద్భుత నటనను చూసి రాజమౌళి ముచ్చటపడి చాల కష్టంతో ఈమెను ‘ఆర్ ఆర్ ఆర్’ లో నటించడానికి ఒప్పించినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈమె ఈ మూవీ ప్రాజెక్ట్ నుండి ఎందుకు తప్పుకుంది అన్న విషయం సమాధానం లేని ప్రశ్నగా మారింది.  

ఈమె ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లుగా అధికారికంగా ప్రకటింప బడింది. దీనితో తిరిగి రాజమౌళికి ‘ఆర్ ఆర్ ఆర్’ కు సంబంధించి మళ్ళీ హీరోయిన్ కష్టాలు మొదలు అయినట్లు అనుకోవాలి. ఇలాంటి పరిస్థుతులలో రాజమౌళి ఈమె స్థానంలో మరో లండన్ బ్యూటీని ఎంపిక చేస్తాడా ? లేదంటే మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన మరో హీరోయిన్ ను ఎంచుకుంటాడా అన్నది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్న..


మరింత సమాచారం తెలుసుకోండి: