ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా అనీల్ రావిపూడి దర్శకత్వంలతో వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన ఎఫ్ 2 చిత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది.  ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా పెద్ద చిత్రాలను ఢీ కొట్టి సూపర్ హిట్ కావడంతో ఇతర భాషల నిర్మాతల దృష్టి పడింది. ఈ చిత్రాన్ని  ఇప్పుడు హిందీలో రీమేక్ చేయబోతున్నారు.  దీలో ఈ చిత్రాన్ని బోనీ కపూర్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తుండగా, అనీష్ అజ్మీ దర్శకత్వం వహించనున్నట్టు సమాచారం.


అలాగే వరుణ్ తేజ్ పాత్రలో బోనీకపూర్ కుమారుడు అర్జున్ కపూర్ కనిపంచనుండగా, వెంకటేష్ పాత్రకు అనీల్ కపూర్ కానీ మరో సీనియర్ హీరో గానే చేసే అవకాసం ఉందని సమాచారం. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతానికి మంచి ఆదరణ లభించింది.  ఈ చిత్రంలో తమన్నా నటించే అవకాశం ఉందని..మెహ్రీన్ ప్లేస్ లో మరో హీరోయిన్ నటించే అవకాశం ఉందని అంటున్నారు. 


ఫుల్ లెంగ్త్ కామెడీతో నిర్మితమైన ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. అయితే మరి ఈ చిత్రానికి హిందీలో కొద్ది పాటి నేటివిటి మార్పులు చేస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ జరుగుతోంది.  తెలుగు హిట్ అయినట్లు బాలీవుడ్ లో హిట్ అవుతుందా లేదా అన్న విషయం రిలీజ్ అయ్యే వరకు తెలియదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: