నిన్న సాయంత్రం రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ ను కలవడమే కాకుండా అతడితో సుమారు రెండు గంటల పాటు సమావేశం కావడం మెగా అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే పవన్ ప్రకటించిన ‘జనసేన’ మేనిఫెస్టోకి తన సంఘీభావం ప్రకటించిన చరణ ఇప్పుడు పవన్ ను కలవడం చర్చనీయాంసంగా మారింది.

ఇక ప్రచారానికి కేవలం మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపధ్యంలో చరణ్ పవన్ కు మద్దతు తెలుపుతూ కొన్నిచోట్ల సుడిగాలి పర్యటన చేయబోతున్నట్లు టాక్. ముఖ్యంగా పవన్ పోటీ చేస్తున్న భీమవరం గాజువాక ప్రాంతాలలో చరణ్ సుడిగాలి పర్యటన ఉండేలా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఎలక్షన్ ప్రచారం క్లైమాక్స్ కు వచ్చిన పరిస్థుతులలో ఇప్పటికే ఓటర్లు ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా సంకేతాలు అందుతున్నాయి. ఇక ఈ చివరి రోజులలో ప్రచారం పై కన్నా ఎన్నికలు జరిగే ప్రతి బూత్ లోను సుక్షితులైన కార్యకర్తలను ఏర్పాటు చేసుకుని తమకు పడే ఓట్లను పోల్ చేయించుకునే ఎలక్షన్ మేనేజ్ మెంట్ కీలకం కావడంతో ఈవిషయాల పై దృష్టి పెట్టాలి. 

ఇలాంటి పరిస్థుతులలో చివరి నిముషంలో పవన్ కోసం రంగంలోకి దిగిన చరణ్ చేయబోయే ప్రచారం తనకోసం జనాన్ని వచ్చేలా చేయగలుగుతుంది కాని ఎంతవరకు ఓటర్లను ప్రభావితం చేయగలుగుతుంది అన్న విషయమై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే చరణ్ రాకతో మెగా అభిమానులలో మరింత ఉత్సాహం ఏర్పడి పవన్ పోటీ చేస్తున్న భీమవరం గాజువాక స్థానాలతో పాటు నాగబాబు పోటీ చేస్తున్న నర్సాపురం స్థానంలో చరణ్ ప్రచారంతో ఓటర్లలో కలకలం రావడం ఖాయం..


మరింత సమాచారం తెలుసుకోండి: