ఉగాది పండుగరోజున విడుదలైన ‘మహర్షి’ టీజర్ కేవలం కొన్ని గంటలలోనే 8 మిలియన్ వ్యూస్ అందుకోవడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ఈమూవీ టీజర్ కు వచ్చిన అనూహ్య స్పందనను చూసి ఈమూవీ టీమ్ మంచి జోష్ లో ఉంది. 

అయితే అనూహ్యంగా ఈమూవీ టీజర్ ను టార్గెట్ చేస్తూ వస్తున్న కామెంట్స్ ఈమూవీ బయ్యర్లను కలవర పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం ఈమూవీ టీజర్ అనుకున్న స్థాయిలో లేకపోవడం అని అంటున్నారు. అంతేకాదు ఈమూవీ టీజర్ ‘శ్రీమంతుడు’ సినిమాకు కంటిన్యూషన్ గా ఉండటమే కాకుండా అల్ట్రా స్టైలిష్ గా ఉన్న మహేష్ దిగడం అతడి నడక అంతా ‘శ్రీమంతుడు’ లోని మహేష్ పాత్ర బాడీ లాంగ్వేజ్ తో కనిపించడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. 

అలాంటి స్టైలిష్ లుక్ తో ఉన్న మహేష్ మాసిపోయిన షర్ట్ వేసుకుని సక్సెస్ స్టోరీ గురించి ఒక డైలాగ్ చెప్పి ఏదో ఒలింపిక్స్ లో రన్నింగ్ రేస్ పోటీలో ఉన్నట్లుగా మహేష్ పరుగు పెడుతూ కనిపించడం కొంతమందికి కనెక్ట్ కాలేదు అని తెలుస్తోంది. అంతేకాదు ‘శ్రీమంతుడు’ సినిమాలో కన్పించే మామిడితోటతో పాటు సేమ్ అలాంటి పైట్లు చివరకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సేమ్ టు సేమ్ శ్రీమంతుడు సినిమాలానే కన్పించడంతో నెగిటివ్ కామెంట్స్ ప్రారంభం అయ్యాయి.

దీనితో కొందరు తాము చూస్తున్నది ‘మహర్షి’ టీజర్ అనుకోవాలా లేదంటే ‘శ్రీమంతుడు’ పార్ట్ 2 అని అనుకోవాలా అంటూ ఏకంగా సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. దీనితో ఈమూవీ టీజర్ విడుదలైన ఒక్కరోజు పూర్తి కాకుండానే ఇలా నెగిటివ్ కామెంట్స్ దాడి మొదలవ్వడం హాట్ టాపిక్ గా మారింది..  


మరింత సమాచారం తెలుసుకోండి: