ఎన్నికలు సమీపిస్తున్న వేళ పవన్ కళ్యాణ్ కోరుకున్నట్లుగా 25 సీట్లు కాకపోయిన కనీసం 5 సీట్లు అయినా వస్తాయా రావా  అన్న అనుమానంలో పవన్ అభిమానులు ఉన్నారు. దీనికితోడు పవన్ పోటీ చేస్తున్న రెండు స్థానాలలో గాజువాకలో మాత్రమే అతితక్కువ మెజారిటీతో గెలుస్తాడు అంటూ వస్తున్న సర్వేలు జనసైనికులను కూడ ఖంగారు పెట్టిస్తున్నాయి.

అయితే పవన్ వీరాభిమానులు మాత్రం తమ హీరోని ‘బాహుబలి’ తో పోలుస్తూ ఒక సరికొత్త ప్రచారాన్ని ఈ ఎన్నికల క్లైమాక్స్ ఘట్టంలో చేస్తున్నారు. రెండు మూడు రోజుల క్రితం పవన్ ఎండలకు తట్టుకోలేక సొమ్మసిల్లి పడిపోయిన సంఘటనతో వైద్యులు విశ్రాంతి తీసుకోమని సలహా ఇచ్చిన విషయం తెలిసిందే. 

అయితే కనీసం ఒక్కరోజు కూడ పూర్తిగా విశ్రాంతి తీసుకోకుండా పవన్ తన చేతికి డాక్టర్లు సెలైన్ బాటిల్స్ ఎక్కించడం కోసం గుచ్చిన కాన్యులాతో పవన్‌ తన చివరి నిముషం ఎన్నికల ప్రచారం చేస్తూ హోరేత్తిస్తున్నాడు. ఈ సందర్భంగా పవన్ ఆవేశంగా మాట్లాడుతూ తన చేతిని ఎత్తి ఉద్వేగంతో ఉపన్యసిస్తున్న పవన్‌ చేతిని ఫోటోలు తీసి ‘బాహుబలి’ లో ప్రభాస్‌ చెయ్యి ఎత్తిన ఫోజ్‌ తో దీనిని పోలుస్తూ పొలిటికల్ రియల్‌ హీరో పవర్ స్టార్ అంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. 

దీనితో ఈ ఫోటోలకు విపరీతమైన స్పందన వస్తోంది. పవన్ పోరాట స్పూర్తికి ఇది నిదర్శనం అంటూ ప్రసంసలు కూడ వస్తున్నాయి. అయితే ఇక కేవలం రెండు రోజులు మాత్రమే ప్రచారానికి మిగిలి ఉన్న పరిస్థుతులలో ఈ ‘బాహుబలి’ ప్రశంసలు పవన్ కు ఎంత వరకు ఓట్లు కురిపిస్థాయి అన్న విషయంలో అనేక సందేహాలు ఉన్నాయి. కనీసం ‘జనసేన’ పార్టీకి 5 స్థానాలు కూడ రాకుంటే ఎన్నికల తరువాత పవన్ ఎంత కష్టపడినా ‘జనసేన’ ను బతికించడం కష్టం అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: