‘ప్రజారాజ్యం’ ఘోర పరాజయం తరువాత పవన్ చిరంజీవిల మధ్య గ్యాప్ ఏర్పడినట్లుగా ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను ఎప్పటికప్పుడు చిరంజీవి ఖండిస్తూ వచ్చాడు. ఈ నేపధ్యంలో ఈ ఎన్నికల ప్రచారంలో అప్పుడు జరిగిన అసలు విషయాలను పవన్ కళ్యాణ్ ఓపెన్ గా మీడియా సాక్షిగా తెలియచేయడం అత్యంత సంచలనంగా మారింది. 

మండుతున్న ఎండలు వడదెబ్బను లెక్క చేయకుండా ఎన్నికల ప్రచారంలో క్లైమాక్స్ అంకంలో ఉన్న పవన్ తెనాలిలో మాట్లాడుతూ తనకు చిరంజీవికి మధ్య రెండు సంవత్సరాల పాటు మాటలు లేకపోవడమే కాకుండా కనీసం ఒకరికి ఒకరు ఒక్క ఫోన్ కాల్ కూడ చేసుకొని విషయాన్ని వివరించాడు. అలాంటి పరిస్థుతులలో తనకు తన అన్న చిరంజీవికి రాజీ కుదిర్చిన వ్యక్తి నాదెండ్ల మనోహర్ అంటూ అప్పటి విషయాన్ని ఇప్పుడు బయటపెట్టాడు పవన్.

దీనితో తనకు మనోహర్ అంటే తనకు ప్రత్యేక అభిమానం అని చెపుతూ మనోహర్ కు ఓట్లు వేసి గెలిపించమని తెనాలి ఓటర్లను అడగడం షాకింగ్ న్యూస్ గా మారింది. ఇదే సందర్భంలో పవన్ జగన్ చంద్రబాబుల పై తీవ్ర విమర్శలు చేస్తూ వీరిద్దరిలో ఎవరు అధికారంలోకి వచ్చినా అవినీతి లక్షల పెరిగిపోతుంది అంటూ పవన్ కామెంట్స్ చేసాడు. 

అయితే పవన్ ఉపన్యాసాలలో తాను అధికారంలోకి వస్తే ఏమి చేస్తాడో చెప్పే విషయాలతో పాటు తన కుటుంబ సభ్యుల గురించి తరుచు తన ఉపన్యాసాలలో చెప్పడం వల్ల పవన్ కు పడే ఓట్ల శాతం ఏమి పెరుగుతుంది అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఎలా ఉన్నా తన వ్యక్తిగత విషయాల గురించి పదేపదే తన ఉపన్యాసాలలో వివరిస్తూ తాను అత్యంత నిజాయితీ పరుడుని అని ఇమేజ్ సృష్టించుకోవడానికి పవన్ ప్రయత్నాలు చేస్తున్నా ఆ ప్రయత్నాలు పవన్ అభిమానుల వరకు చేరుకుంటోంది కాని సామాన్య ఓటర్ దృష్టిని ఆకర్షించలేకపోవడం పవన్ కు మైనస్ పాయింట్ గా మారింది..   


మరింత సమాచారం తెలుసుకోండి: