ఈసారి ఎన్నికల ప్రచారంలో బాలకృష్ణ ముఖంలో ఒక్కసారి కూడా నవ్వు కనిపించలేదు అని అతడి సన్నిహితులే కామెంట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ ఫ్లాప్ అయిన రోజు నుండి బాలకృష్ణ తీవ్ర అసహనంతో రగిలి పోతున్నాడు అన్న సంకేతాలు ఇప్పటికే వచ్చాయి. బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం ఎన్నికల ప్రసారం చేయడం ఇదే మొదటిసారి కాదు. 

గతంలో అనేక సార్లు జరిగిన ఎన్నికలలో బాలయ్య ప్రచారం చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో జోక్స్ పేలుస్తూ ఉండేవాడు. అయితే ఈసారి జరుగుతున్న ప్రచారంలో తన వ్యవహార శైలిని మార్చి ఎదో పోగొట్టుకున్న వాడిలా అనుక్షణం ఆలోచిస్తూ మాట్లాడే మాటలలో మరింత తడబాటు పెరిగి పోయింది అనీ బాలకృష్ణ ఉపన్యాసాలను దగ్గరగా పరిశీలిస్తున్న విశ్లేషకులు చెపుతున్నారు. 

ఇప్పుడు ప్రతి పదిమందిలో కనీసం ఎనిమిది మంది చేతిలో కెమెరా సెల్ ఫోన్లు ఉంటున్నాయి అన్న విషయం తెలిసి కూడ బాలయ్య పబ్లిక్‌లో బాలయ్య తన బిహేవియర్‌ మార్చుకోవడంలేదు. గత కొంతకాలంగా బాలయ్య చెయ్యి జారి నోరు జారి కెమెరాలకి దొరికి పోతున్నా ఆవిషయాలను పట్టించుకోవడం లేదు. ఇది చాలదు అన్నట్లుగా లేటెస్ట్ గా శ్రీకాకుళం జిల్లా చీపురుపల్లి నియోజక వర్గం దగ్గర బాలయ్య ఉన్యాసం వినడానికి అభిమానులు విపరీతంగా రావడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. 

దీనితో కోపగించిన బాలకృష్ణ ట్రాఫిక్ నియంత్రణ పేరుతో అక్కడకు చేరిన తన అభిమానుల పై అసహనంగా ఊగిపోతూ తన అభిమానులు అని కూడ లెక్కచేయకుండా వారిని ఒక తోపుతోయడంతో అభిమానులు కూడ కలత చెందినట్లు తెలుస్తోంది. దీనితో ఈ టెన్షన్ అంతా హిందుపూర్‌లో ఓడిపోతారంటూ వస్తున్న సర్వే రిపోర్ట్ లలో అనుకోవాలా లేక ఎన్టీఆర్‌ బయోపిక్‌ దారుణంగా ఫెయిలవడమా లేక ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ రిలీజ్‌ ను ఆపలేకపోయాను అన్న అసహనమా అంటూ రాజకీయ వర్గాలలోనే కాకుండా ఇండస్ట్రీ వర్గాలలో కూడ బాలకృష్ణ అసహనం పై చర్చలు జరుగుతున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: