రామ్ చరణ్ ప్రత్యేకంగా విజయవాడ వచ్చి పవన్ ను కలిసి ఏకాంతంగా సుమారు ఒక గంట సేపు చర్చలు జరపడంతో చరణ్ పవన్ కు బాసటగా ఈ ఎన్నికల ప్రచార చివరి ఘట్టంలో కలియ తిరుగుతాడు అని పవన్ అభిమానులు కొండంత ఆశతో  ఎదురు చూసారు. అయితే రేపటితో ప్రచారం ముగిసిపోతున్నా చరణ్ ఎక్కడా ప్రచారానికి వచ్చే సంకేతాలు కనిపించడం లేదు.

దీనితో జరుగుతున్న పరిమాణాల పై పవన్ అభిమానులు ఎంతో కలత చెందుతున్నట్లు టాక్. చరణ్ ‘జనసేన’ టి. షర్ట్ వేసుకుని పవన్ కోసం ప్రచారం చేస్తున్నట్లుగా ఊహించుకుని చాలామంది అభిమానులు అలాంటి ఫోటోలను డిజైన్ చేసి సోషల్ మీడియాలో పెట్టి నిన్నటిరోజు అంతా హడావిడి చేసారు. అయితే ఇప్పుడు చరణ్ రాకకు సంబంధించిన క్లారిటీ లేకపోవడంతో పవన్ వీరాభిమానులు నిరాశలో ఉన్నారు.  

దీనితో చరణ్ ఈ జనరేషన్ హీరోల తెలివితేటల్ని పవన్ పై ప్రదర్శించాడు అంటూ కొందరు చరణ్ టార్గెట్ చేస్తూ కామెంట్స్ కూడ పెడుతున్నారు. అయితే చరణ్ ‘జనసేన’ ప్రచారానికి దూరంగా ఉన్నా వరుణ్ తేజ్ నిహారికలు మాత్రం ఈ చివరి రోజుల ప్రచారంలో తమ తండ్రి నాగబాబు గెలుపు కోసం తమకు చేతనైన స్థాయిలో గట్టిగానే ప్రచారం చేస్తున్నారు.  

అయితే చరణ్ ఇలా విజయవాడకు వచ్చి ప్రచారానికి అందుబాటులో ఉండకుండా తిరుగు టపాలో హైదరాబాద్ వెళ్ళి పోవడానికి ఒక కారణం ఉంది అని అంటున్నారు. గతంలో చరణ్ చిరంజీవి ప్రజారాజ్యం విజయం కోసం ట్రైన్ లో హైదరాబాద్ నుండి విశాఖపట్నం వరకు అల్లు అర్జున్ తో కలిసి ట్రైన్ లో ప్రచారం చేస్తూ కష్టపడినా ఓట్లు పడలేదు. దీనితో ఆ అనుభవాలు అన్నీ గుర్తుకు వచ్చి చరణ్ రివర్స్ గేర్ తీసుకున్నాడా లేకుంటే ఈసలహాను స్వయంగా పవన్ చరణ్ కు ఇచ్చాడా అనే విషయమై భిన్నాభిప్రాయాలు అభిమానులు వ్యక్తపరుస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: