రాజకీయాలంటేనే వెన్నుపోట్లు  సర్వసాధారణం. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ తో ఈ వెన్నుపోటు సీన్ విపరీతంగా పాపులర్ అయింది. ఇప్పుడు అదే వెన్నుపోటు సీన్ తనకు కూడ ఎదురైంది అంటున్నాడు పవన్ కళ్యాణ్. అయితే తనను వెన్నుపోటు పొడిచింది కమెడియన్ అలీ అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. నిన్న రాజమండ్రిలో పవన్ ‘జనసేన’ కోసం ప్రచారం చేస్తూ ఈ కామెంట్స్ చేసాడు. 

అలీ కోసం తాను చాలా గ్రౌండ్ వర్క్ చేశాను అంటూ అలీ చెప్పాడనీ అతడి బావమరిదికి టిక్కెట్ కూడ తాను ఇస్తే కనీసం తనతో ఒక్క మాట కూడ చెప్పకుండా అలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరిపోవడం తనకెంతో బాద కలిగించింది అంటూ కామెంట్స్ చేసాడు. అంతేకాదు అలీ వైసిపి లో చేరినప్పుడు పవన్ గెలవడు జగన్ గెలుస్తాడని అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు ఎందుకు వెళ్ళిపోయాడో తనకు ఇప్పటికీ అర్ధం కాదనీ అంటూ తన బాధను వ్యక్త పరిచాడు. 

ఒక వ్యక్తితో ప్రయాణం అతడి వ్యక్తిత్వాన్ని చూసి ఉండాలి తప్ప ఫలితాలు ఆశించి అలీ లాంటి మిత్రులు కూడ మోసం చేస్తే తాను ఎవరికీ చెప్పుకోవాలి అంటూ ఉద్వేగంతో రగిలి పోయాడు పవన్. చాలామంది తన వద్దకు వచ్చినవారు వెంటనే ఫైలితాన్ని ఆశిస్తున్నారని అయితే అలా ఫలితం ఇవ్వడానికి తాను ఏటిమ్ మిషన్ కాదు కదా అంటూ తన పై తానే సెటైర్లు వేసుకున్నాడు పవన్. 1996లో తాను తన మొదటి సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ లో నటిస్తున్నప్పుడు తాను పవర్ స్టార్ అవుతానని కలకనలేదనీ అదేవిధంగా రాజకీయాలలో కూడ తాను ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం అంటూ పవన్ తన రాజకీయ ఉద్దేశ్యాన్ని మరొకసారి వివరించాడు. 

ప్రస్తుతం రాజకీయాలలో తన వెంట నడిచే వారికి రిజల్ట్స్ ఇస్ స్టంట్ కాఫీలా కావాలని కోరుకుంటున్నారని అయితే అలాంటి రిజల్ట్స్ ప్రస్తుత రాజకీయాలలో రావు అంటూ కామెంట్ చేసాడు. అయితే అనూహ్యంగా ఈసమావేసంలో ‘పవన్ సిఎమ్’ అంటూ నినాదాలు ఇస్తున్న వారి వంక చూస్తూ తన పై ప్రేమ ఉంటే ఓట్లు వేయాలి కాని నినాదాలు చేస్తే తాను ముఖ్యమంత్రి కాలేను అంటూ పవన్ చేసిన కామెంట్స్ ను బట్టి పవన్ లోని నైరాశ్యం కనిపిస్తోంది అంటూ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: