వరస హిట్లతో దూసుకుపోతున్న సమంత పెళ్ళి తరువాత కూడ తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు అన్నసంకేతాలు ఇస్తోంది. లేటెస్ట్ గా విడుదలైన ‘మజిలీ’ అదేవిధంగా కోలీవుడ్ లో ఆమె నటించిన ‘సూపర్ డీలక్స్’ సూపర్ హిట్ మూవీలుగా మారడంతో ఆమె తెలుగు తమిళ భాషలలో నటించిన రెండు సినిమాల సక్సస్ ను ఎంజాయ్ చేస్తోంది. 

అయితే ఇక్కడే సమంత స్టార్ డమ్ పై కొందరు సందేహాలు వ్యక్తపరుస్తున్నారు. సమంత నటించిన సినిమాలలో బ్లాక్ బస్టర్ హిట్స్ అయిన సినిమాలు అన్నింటిలోను సమంతకు నటన పరంగా మంచి పాత్ర ఉన్నా ఆమె నటించిన ఈ సూపర్ హిట్ మూవీలలో హీరోల సపోర్ట్ కూడ ఉంది అన్న కామెంట్స్ వస్తున్నాయి. 

గత సంవత్సరం విడుదలైన ‘రంగస్థలం’ లో చరణ్ సపోర్ట్ ఉంటే లేటెస్ట్ గా విడుదలైన ‘మజిలీ’ మూవీలో చైతన్య సపోర్ట్ ‘సూపర్ డీలక్స్’ మూవీలో విజయ్ సేతుపతి సపోర్ట్ తో మాత్రమే సమంత రాణించింది కాని హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలకు సమంత నయనతారలా పనికిరాదు అన్న కామెంట్స్ కొందరు విశ్లేషకులు చేస్తున్నారు. దీనికి ఉదాహరణగా గత సంవత్సరం విడుదలైన ‘యూటర్న్’ మూవీలో సమంత నటన బాగున్నా కలక్షన్స్ రాలేదు అన్న విషయాన్ని గుర్తుకు చేస్తున్నారు. 

దీనితో సమంత నటిస్తున్న మరో మూవీ ‘ఓ బేబి’ సినిమా ఫలితం కూడ ఇలాగే ఉంటుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థుతులలో అనుష్క నయనతార ఒకనాటి విజయశాంతి తరహాలో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలను సమంత చేయలేదని ఒకవేళ కష్టపడి చేసినా ప్రేక్షకులను ధియేటర్ల వరకు రప్పించుకునే శక్తి సమంతకు లేదు అని కామెంట్స్ వస్తున్న నేపధ్యంలో ఎప్పటికీ సమంత హీరోల పక్కన నీడగా కనిపించే పాత్రలకే పరిమితం అయిపోతుందా అన్న సందేహాలు కలగడం సహాజం.. 


మరింత సమాచారం తెలుసుకోండి: