తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ముని చిత్రంతో హర్రర్, థ్రిల్లర్, కామెడీ కాన్సెప్ట్ తో నటుడు, దర్శకుడు లారెన్స్ మంచి విజయం అందుకున్నాడు.  ఇదే కాన్సెప్ట్ తో వరుసగా కాంచన, గంగ లాంటి చిత్రాలతో సూపర్ హిట్ అందుకున్నారు.  ఇప్పుడు ముని 4 సీక్వలె ‘కాంచన3’ తో రాబోతున్నారు.  లారెన్స్ సరసన వేదిక .. ఓవియా నటించిన ఈ సినిమాను ఈ నెల 19వ తేదీన విడుదల చేయనున్నారు.

ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ రిలీజ్ అయ్యింది.  టీజర్ లో లారెన్స్ లుక్ కూడా డిఫరెంట్ గా ఉంది.  తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డువారు ఈ సినిమాకి U/A సర్టిఫికేట్ ను మంజూరు చేశారు. ఇప్పటి వరకూ వచ్చిన టీజర్ .. ట్రైలర్ మరింతగా భయపెట్టేలా ఉండటంతో అంచనాలు పెరిగిపోతున్నాయి.

ఇప్పటి వరకు ఈ తరహా చిత్రాలకు ప్రేక్షకులు మంచి ఆదరణ ఇస్తున్నారని..ఈసారి కూడా వారిని మెప్పించేలా చిత్రం తీశామని లారెన్స్ అంటున్నారు.  డిఫరెంట్ లుక్ తో లారెన్స్ కనిపించే ఈ సినిమా, ఆయనకి భారీ విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: