ఈరోజు సాయంత్రం 5 గంటలకు మన తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల ప్రచారం ముగిసిపోతుంది. ఆతరువాత ఏ పార్టీ మరొక పార్టీని విమర్శిస్తూ విమర్శలు చేయరు. కనీసం పత్రికలలో అలాగే న్యూస్ ఛానల్స్ లో తమకు ఓట్లు వేయండీ అంటూ ప్రకటనలు కనిపించవు. అంతా నిశ్శబ్దమే రాజ్యం ఏలుతుంది. 

ఇలాంటి పరిస్థుతులలో ఆంధ్రప్రదేశ్ లో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదల కాకపోయినా ఈమూవీ పబ్లిసిటీ యాడ్స్ న్యూస్ ఛానల్స్ లో చాల విపరీతంగా కనిపించబోతున్నాయి అన్న లీకులు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ యాడ్స్ న్యూస్ ఛానల్స్ లో ఈ సాయంత్రం నుండి న్యూస్ ప్రసారం అయ్యే ప్రతి బ్రేక్ లోను ప్రసారం అయ్యేలా మాస్టర్ ప్లాన్ వేసినట్లు టాక్. 

సాధారణంగా టాప్ హీరోల సినిమాల విడుదలకు ముందు ఇలా న్యూస్ ఛానల్స్ లో యాడ్స్ హంగామా కనిపిస్తోంది. అయితే ఈసినిమా విడుదలై రెండు వారాలు అవుతున్న పరిస్థుతులలో ఇప్పుడు ఇలా యాడ్స్ సంఖ్యను పెంచడం వెనుక ఒక ఎత్తుగడ ఉంది అన్న మాటలు వినిపిస్తున్నాయి. 

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ఈసినిమాలోని ఎన్టీఆర్ కు జరిగిన ఘోర అవమానానికి సంబంధించిన సంఘటనలను హైలెట్ చేస్తూ ఉండే సీన్స్ ను ఈ యాడ్స్ లో చూపించబోతున్నట్లు సమాచారం. ఎన్నికల కమీషన్ ఆదేశాల ప్రకారం రాజకీయ పార్టీల ప్రకటనలు ఛానల్స్ లో ఉండకూడదు కానీ సినిమా ప్రకటనలకు ఎన్నికల నియమ నిబంధనలు అడ్డురావు. దీనితో చాల తెలివిగా వర్మ టీమ్ తన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీని ఆంద్రప్రదేశ్ ఓటర్లను ప్రభావితం చేసే విధంగా వేసిన ఈ మాష్టర్ స్కెచ్ వెనుక ఒక ప్రముఖ రాజకీయపార్టీ హస్తం ఉంది అన్నప్రచారం జరుగుతోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: