‘బాహుబలి’ తో నేషనల్ సెలిబ్రిటీగా మారిపోయిన ప్రభాస్ సినిమాలు చైనా జపాన్ భాషలలో కూడ విడుదలైన నేపధ్యంలో ప్రభాస్ కు హాలీవుడ్ లో కూడ అభిమానులు ఉన్నారు. అయితే నేచురల్ స్టార్ నాని ఏకంగా ప్రభాస్ రేంజ్ కి ఎదగడానికి చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు షాకింగ్ న్యూస్ గా మారింది. ఈనెల ఏప్రిల్ 19న విడుదలకాబోతున్న ‘జెర్సీ’ మూవీని చైనాలో విడుదల చేస్తున్నట్లు నాని ప్రకటించి అందరికి షాక్ ఇచ్చాడు. 

ప్ర‌స్తుతం సమయం లేకపోవడం వల్ల ‘జెర్సీ’ మూవీని తెలుగులో మాత్రమే విడుద‌ల చేస్తున్నామని అయితే చైనాలో ఇలాంటి స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామా మూవీలకు మంచి ఆదరణ ఉన్నందున అక్కడ కూడా విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు నాని ప్రకటించడం ఇప్పుడు షాకింగ్ న్యూస్ గా మారింది. ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాని  ఈవిషయాలను వెల్లడించాడు. 

ఈ సినిమాలో తన పాత్ర తనకు ఎంతో  నచ్చింది అన్న విషయాలను వివరిస్తూ ఫస్ట్ టైమ్ స్క్రీన్ మీద ఉన్నది తనే అనే విషయం మరిచిపోయి నటించిన సందర్భాలను గుర్తుకు చేసుకున్నాడు నాని. తాను ఇప్పటి వరకు ఈసినిమాను 20 సార్లు చూశానని తాను నటించిన ఏ సినిమాను విడుదల కాకుండా ఇన్నిసార్లు చూసిన సందర్భం తన కెరియర్ లో లేదు అంటూ కామెంట్స్ చేసాడు. 

వాస్తవానికి ఈసినిమా టీజర్ పోస్టర్లు చూసి అంతా క్రికెట్ సినిమా అనుకుంటున్నారనీ అయితే ఈసినిమాలో ఎవరూ ఊహించని ఒక సర్ ప్రైజ్ ఉంది అంటూ ఆఅసలు విషయం ఈమూవీ ట్రైలర్ లో తెలుస్తుంది అంటూ ఈమూవీ పై అంచనాలు పెంచుతున్నాడు. ఈమూవీ ద్వారా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గర్వించే మరో దర్శకుడు దొరికాడు అంటూ ఈమూవీ పై అంచనాలు పెంచుతున్న నాని ఈ సినిమా కథలో క్రికెట్ అనేది నీడలాగా ఉంటుంది కానీ అసలు కథ  వేరు అంటూ సంకేతాలు ఇస్తున్నాడు. ఇప్పటికే క్రికెట్ నేపధ్యంతో వచ్చిన ‘మజిలీ’ సూపర్ హిట్ అయిన నేపధ్యంలో తిరిగి అదే క్రికెట్ నేపధ్యంలో కేవలం రెండు వారాల గ్యాప్ తో వస్తున్న ఈమూవీని ఎంతవరకు ప్రేక్షకులు ఆదరిస్తారు అన్న సందేహాలు ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: