నడుస్తున్న కాలం మోహన్ బాబుకు ఏమాత్రం కలిసి వస్తున్నట్లుగా కనిపించడం లేదు. 550 సినిమాలు చేసిన మోహన్ బాబు తాను మంచి పాత్రలు వస్తే నటిస్తాను అని ఓపెన్ గా సంకేతాలు ఇస్తున్నా టాప్ దర్శకులు ఎవరూ పట్టించుకోని పరిస్థితి. ఇలాంటి పరిస్థుతులకుతోడు ఈమధ్య చెక్ బౌన్స్ కేసు విషయంలో ఏడాది జైలు శిక్ష పడటంతో ఈ తీర్పును సవాలు చేస్తూ సెషన్స్ కోర్టులో అపీలు చేస్తాను అంటూ ప్రకటన ఇచ్చి ప్రస్తుతం బెయిల్ పై ఉన్నాడు మోహన్ బాబు.

ఇలాంటి పరిస్థుతులలో మోహన్ బాబు మరో భూవివాదంలో చిక్కుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఈ వివాదాన్ని నిర్మాత వైవీస్ చౌదరి లేటెస్ట్ గా వెలుగులోకి తీసుకు వచ్చాడు. కోర్టును తాను తప్పుదోవ పట్టించానని మోహన్‌బాబు ఆరోపించడం తనకు బాధ కలిగించిందని చెబుతూ మోహన్‌ బాబుకి ఒక భూవివాదానికి సంబంధించి లీగల్‌ నోటీసులు పంపానని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. 

గతంలో తన కష్టార్జితంతో కొనుక్కున్న స్థలంలోకి మోహన్ బాబు రానివ్వడం లేదనీ సంచలన వ్యాఖ్యలు చేసాడు చౌదరి. ఈ విషయమై తాను న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటూ మోహన్ బాబుకు నోటీసులు పంపిన విషయాన్ని బయటపెట్టాడు.  ‘సలీమ్’ చిత్రం విషయంలో మోహన్ బాబుకు చౌదరికీ ఏర్పడ్డ అభిప్రాయ భేదాలు ఇప్పుడు కేసుల వరకు వెళ్ళిపోయాయి. 

సాధారణంగా ఒక సినిమా ఫ్లాప్ అయినప్పుడు ఆసినిమాకు సంబంధించిన హీరోలకు దర్శకులకు ఇవ్వవలసిన పేమెంట్స్ విషయంలో కొన్ని సద్దుబాట్లు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా దాసరి జీవించి ఉన్నప్పుడు చౌదరి మోహన్ బాబుల మధ్య కుదిరిన రాజీ దాసరి మరణం తరువాత అమలు జరగకపోవడంతో ఇలాంటి సమస్యలు ఏర్పడ్డాయి అని ఇండస్ట్రీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏమైనా ఒకేసారి మోహన్ బాబును అనేక సమస్యలు చుట్టుముట్టడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: