యాంకర్ రష్మీ తన ఓటు మిస్ అయింది అంటూ సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేసింది. అంతేకాదు తనకు తన తల్లికి సంబంధించిన ఓటు స్లిప్స్ తమకు చేరలేదనీ తాను ఓటు వేద్దామని వైజాగ్ వస్తే తన ఓటు ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి అంటూ కామెంట్స్ చేసింది. అంతేకాదు తమ ఇంటి చట్టుపక్కల వారికి కూడ ఇదే పరిస్థితి అంటూ గగ్గోలు పెడుతోంది.

అంతేకాదు తన ఓటు ఎక్కడ ఉందో తెలుసుకుందామని ఎలక్షన్ కమీషన్ వెబ్ సైట్ ఓపెన్ చేసి చెక్ చేసుకుందాము అంటే అది ఓపెన్ కావడం లేదు అంటూ కామెంట్స్ చేసింది. దీనితో రష్మీ కామెంట్స్ చూసిన ఒక నెటిజన్ నెల రోజుల ముందు ఓటు ఉందో లేదో చూసుకోవాలి కదా అని అడిగిన ప్రశ్నకు రష్మీ ఘాటైన సమాధానం ఇచ్చింది. 

తాను కట్టవలసిన ఇంటి పన్ను ఎలట్రీ సిటీ బిల్లు వాటర్ బిల్లు తాను అడగకుండానే తన ఇంటికి పంపుతున్న అధికారులకు తన ఓటు స్లిప్ ను పంపాలి అన్న జ్ఞానం లేదా అంటూ ప్రశ్నిస్తోంది రష్మీ. దీనితో రష్మీకి సంఘీభావం తెలుపుతూ కొందరు ఓటు గురించి జాగ్రత్తలు తీసుకోవలసిన బాధ్యత ప్రజలదే అంటూ మరికొందరు సోషల్ మీడియాలో ఘాటైన కామెంట్స్ వార్ చేసుకుంటున్నారు.

అంతేకాదు వైజాగ్ లో తమది పర్మనెంట్ అడ్రస్సు అయినప్పటికీ తమకే ఇలాంటి పరిస్థితి ఉంటే అద్దె ఇంటిలో ఉండేవారి పరిస్థితి ఏమిటి అంటూ రష్మీ వేస్తున్న ప్రశ్నలు ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. ఇలాంటి పరిస్థుతులలో మళ్ళీ రష్మీ తనకు తన ఓటు ఎక్కడ ఉందో తెలిసింది అంటూ ట్విట్ చేసి ఈ ఓటు రచ్చకు ముగింపు పలికింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: