మూడు వరస పరాజయాల తరువాత నాగచైతన్య నటించిన ‘మజిలీ’ మూవీకి భారీ ఓపెనింగ్స్ రావడమే కాకుండా చైతన్య కెరియర్ లో హైఎస్ట్ ఓపెనింగ్స్ వచ్చిన సినిమాగా మారింది. ఈసినిమా మొదటి మూడురోజుల కలక్షన్స్ చూసిన విశ్లేషకులు ఈమూవీ ‘ఎఫ్ 2’ రికార్డులను బ్రేక్ చేస్తుందా అన్న సందేహాలు కూడ వ్యక్త పరిచారు. 

అయితే ఈమూవీకి సంబంధించి వీకెండ్ తరువాత వచ్చిన మొదటి సోమవారం పరీక్ష గట్టెక్కినా ఆతరువాత వచ్చిన మంగళవారం బుధవారాలలో ఈమూవీ కలక్షన్స్ విపరీతంగా డ్రాప్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికితోడు ఈరోజు ఎన్నికల రోజు కావడంతో అందరి దృష్టి ఓటింగ్ పై ఉంది. 

ఈరోజు ఈమూవీకి సెలవు రోజు అయినప్పటికీ చాల తక్కువ కలక్షన్స్ వచ్చే ఆస్కారం ఉంది. ఇలాంటి పరిస్థుతులలో రేపు విడుదల కాబోతున్న ‘చిత్రలహరి’ మూవీ రిజల్ట్ పై ‘మజిలీ’ పరిస్థితి ఆధారపడి ఉంటుంది అని అంటున్నారు. ఒకవేళ అనుకోకుండా ‘చిత్రలహరి’ యూత్ కు కనెక్ట్ అయితే అది ‘మజిలీ’ కలక్షన్స్ పై తీవ్ర ప్రభావం చూపించే ఆస్కారం ఉంది అని అంటున్నారు. 

దీనితో సక్సస్ టాక్ తెచ్చుకుని కూడ కలక్షన్స్ విషయంలో ‘మజిలీ’ వెనక పడటం నాగార్జున ఫ్యామిలీకి షాకింగ్ న్యూస్ గా మారిందని టాక్. దీనికితోడు ఈమూవీని ఎక్కువగా మల్టీ ప్లేక్స్ ఆడియన్స్ ఆదరిస్తున్న నేపద్యంలో ‘మజిలీ’ కి మాస్ ప్రేక్షకుల ఆదరణ చాల తక్కువగా వస్తోంది అన్న వార్తలు కూడా నాగ్ ఫ్యామిలీకి షాకింగ్ న్యూస్ గా మారినట్లు టాక్..



మరింత సమాచారం తెలుసుకోండి: