తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జున, కళ్యాన్ కృష్ణ దర్శకత్వంలో నటించిన ‘సోగ్గాడే చిన్నినాయన’చిత్రం సూపర్ హిట్ అయ్యింది.  2019 సంక్రాంతి కానుకగా భారీ చిత్రాల నడుమ సోగ్గాడే చిన్ని నాయన రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడే కాదు..నాగ్ కెరీర్ లో అత్యధిక వసూళ్లూ చేసిన చిత్రంగా నిలిచింది.  ఈ చిత్రంలో డబుల్ రోల్ లో కనిపిస్తాడు నాగార్జున. 


ఒక పాత్ర అమాయంగా ఉంటే..బంగార్రాజు పాత్ర దుమ్మురేపుతుంది.  రోమాన్స్, పౌరుషం, కామెడీ అన్ని కలగలిపి ఉన్న పాత్ర అందుకే ఆ ప్రాతకు ఎంతో ప్రాధాన్య వచ్చింది.  అయితే బంగార్రాజు పాత్ర ప్రధానంగా  తీసుకొని ఈ చిత్రం సీక్వెల్ ని తీస్తున్నారు.  ఈ చిత్రం పేరు బంగార్రాజు అని పెట్టబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.  ఈ చిత్రంలో బంగార్రాజు మనవడి పాత్రలో తొలుత నాగచైతన్య నటించనున్నాడన్న వార్తలు వచ్చాయి. అయితే, ఈ పాత్రను నాగచైతన్య కన్నా అఖిల్ తో నటింపజేస్తే బాగుంటుందన్న దర్శకుడి అభిప్రాయంతో నాగ్ ఏకీభవించినట్టు తెలుస్తోంది.


ప్రస్తుతం దర్శకుడు కల్యాణ్ కృష్ణ స్క్రిప్ట్ కు తుది రూపును ఇచ్చే పనిలో బిజీగా ఉన్నారు. నాగ్ ఇప్పుడు 'మన్మధుడు—2' షూటింగ్ లో ఉండగా, అది పూర్తికాగానే 'బంగార్రాజు' మొదలవుతుందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: