చరణ్ కు తగిలిన గాయంతో ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ వాయిదా పడిన నేపధ్యంలో ఈమూవీకి ఏర్పడ్డ హీరోయిన్స్ సమస్య విషయమై రాజమౌళి దృష్టి పెట్టాడు. ఈ చర్చల మధ్య రాజమౌళి ప్రభాస్ సహకారాన్ని కోరబోతున్నట్లు సమాచారం. దీని నిమిత్తం త్వరలో ప్రభాస్ రాజమౌళిలు కలవబోతున్నారని తెలుస్తోంది.

తెలుస్తున్న సమాచారం మేరకు ‘ఆర్ ఆర్ ఆర్’ లో ప్రభాస్ వాయస్ ఓవర్ ఉండబోతోంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా చరణ్ జూనియర్ పాత్రలను ప్రేక్షకులకు పరిచయం చేసే కీలక వాయస్ ఓవర్ ప్రభాస్ చేత చెప్పించబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ప్రభాస్ అంగీకరిస్తే ఈమూవీ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే వచ్చే ఒక స్వాతంత్ర సమరయోధుడి పాత్ర ప్రభాస్ చేత నటింప చేయాలని రాజమౌళి ఆలోచన అని అంటున్నారు.

‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ బడ్జెట్ 350 కోట్లు దాటిపోతున్న నేపధ్యంలో ఈ మూవీకి జాతీయ స్థాయిలో మార్కట్ రావాలి అంటే ప్రభాస్ ఇమేజ్ కూడ అవసరమని రాజమౌళి స్పష్టంగా గుర్తించినట్లు తెలుస్తోంది. దీనికోసమే ఇప్పుడు ప్రభాస్ తో రాజమౌళి రాయబారాలు అని అంటున్నారు. 

ప్రభాస్ సన్నిహితుల నుండి అందుతున్న సమాచారం మేరకు ప్రభాస్ ‘ఆర్ ఆర్ ఆర్’ లో నటించినా నటించక పోయినా వాయస్ ఓవర్ ఇవ్వడం మాత్రం ఖాయం అని అంటున్నారు. ఈమూవీకి సంబంధించి వచ్చేనెల మొదలు కాబోతున్న షెడ్యూల్ లోపలే ప్రభాస్ పాత్ర ‘ఆర్ ఆర్ ఆర్’ ఏవిధంగా ఉంటుంది అన్న విషయమై ఒక క్లారిటీ తీసుకు రావడానికి రాజమౌళి గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: