ఓ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇంకా షాట్ రెడీ కాలేదు. హీరోయిన్ తల ఫోన్లో నుంచి ఎత్తకుండా బిజీగా ఉంది. షాట్ రెడీ అయినా హీరోయిన్ మాత్రం ఫోన్‌ నుంచి తల తీయలేదు.. అసలే ఎమోషనల్ ఫీలింగ్స్ తో ముడిపడిన సినిమా.


అంతే నిర్మాతకు కోపం వచ్చేసింది. విసురుగా హీరోయిన్ చేతిలో నుంచి ఫోన్ లాగుసుకున్నారు. అంతేకాదు.. మరోసారి షూటింగ్‌లో ఫోన్‌ తో కనిపిస్తే బావుండదని వార్నింగ్ కూడా ఇచ్చేశారు. ఇంతకీ ఎవరా నిర్మాత.. ఎవరా హీరోయిన్.. 

ఆ నిర్మాత దిల్ రాజు.. హీరోయిన్ రాశీ ఖన్నా.. శ్రీనివాస కళ్యాణం సినిమా షూటింగ్‌లో జరిగిందీ విషయం. కానీ ఈ సంఘటనను రాశీ ఖన్నా చాలా పాజిటివ్ గా తీసుకుంది. ఆ సినిమా ప్రాధాన్యత అర్థం చేసుకుంది. ఆ తర్వాత మళ్లీ షూటింగ్‌లో ఫోన్‌ తో దిల్ రాజుకు కనిపించలేదట. 

ఈ విశేషాలు.. ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. ఆ సినిమాలో శ్రీ అనే పాత్ర కోసం చాలా కష్టపడిందట. తన పాత్ర చాలా ఎమోషనల్ గా ఉంటుంది. తనకు ఎలాంటి సందేహం కలిగినా.. వెంటనే దర్శకుడిని అడిగి తెలుసుకునేదట. పాపం..రాశీ.. ఇంత కష్టపడి చేసినా సినిమా మాత్రం పెద్దగా ఆడలేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: