నిన్న జరిగిన ‘మజిలీ’ సక్సస్ మీట్ కు ముఖ్య అతిధిగా వచ్చిన కొరటాల శివ నాగచైతన్య నిజాయితీ పై ఆసక్తికర కామెంట్స్ చేసాడు. చైతన్య నటనలోని పాజిటివ్ నెగిటివ్ విషయాల గురించి కొరటాల విశ్లేషణ చేస్తూ వాస్తవికతకు దగ్గరగా ఉండే పాత్రలలో చైతన్య ఇమిడిపోతాడని అతడి నటనలో ఎక్కువగా సహజత్వం కనిపిస్తుందనీ కొరటాల ప్రశంసలు కురిపించాడు.

అంతేకాదు ‘మజిలీ’ మూవీలోని పూర్ణ పాత్రతో చైతన్య టాప్ లీగ్ హీరోల లిస్టులో చైతన్య చేరిపోయాడనీ భవిష్యత్ లో సహజత్వంతో ఉండే పాత్రలను ఎంచుకుంటే చైతన్యకు నటుడుగా ఎదురులేదు అంటూ కొరటాల ప్రశంసలు కురిపించాడు. ఇదే ఫంక్షన్ కు మరొక అతిధిగా వచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడి కూడ చైతన్య పై ప్రశంసలు కురిపిస్తూ అతడి కెరియర్ కు పూర్ణ పాత్ర ఒక టర్నింగ్ పాయింట్ అన్న అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. 

నాగచైతన్య ఫిలిం ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి తొమ్మిది సంవత్సరాలు దాటిపోయిన తరువాత నటుడుగా చైతన్య తనకు తాను ప్రూవ్ చేసుకునే పాత్ర ‘మజిలీ’ మూవీ ద్వారా లభించింది. అయితే చైతు హీరోగా మరొక మెట్టు ఎక్కాలి అంటే టాప్ డైరెక్టర్ల చేతిలో పడాలి. కొరటాల త్రివిక్రమ్ అనీల్ రావిపూడి లాంటి క్రేజీ డైరెక్టర్స్ దగ్గర చైతన్య సినిమాలు చేయగలిగితేనే చైతన్య మరొక మెట్టు ఎక్కగలుగుతాడు. 

అయితే ఇప్పుడు టాప్ దర్శకులు అంతా టాప్ హీరోల చుట్టూనే తిరుగుతున్నారు. ఇలాంటి పరిస్థుతులలో చైతన్యకు మరొక హిట్ లభిస్తే కాని టాప్ దర్శకుల దృష్టి చైతన్య పై పడదు. ఇలాంటి పరిస్థుతులలో చైతు తాను ఎంచుకునే కథల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతే మరొకసారి సమంత వచ్చి చైతూతో మ్యాజిక్ చేసినా మళ్ళీ ‘మజిలీ’ కి వచ్చిన క్రేజ్ వచ్చే ఆస్కారం లేదు అన్న కామెంట్స్ వస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: