మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు సాధారణ ఎన్నికల స్థాయిలో జరగడంతో ఈ సంస్థతో సంబంధం లేని వారికి కూడ ఈ సంస్థ రాజకీయాల గురించి ఆశక్తి పెరిగిపోయింది. దీనికితోడు రాజకీయ నాయకులు లాగా ఒకరి పై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ మీడియా సమావేశాలు నిర్వహిస్తూ తాము కూడ రాజకీయ నాయకులకు ఏమాత్రం తీసిపోవం అంటూ సంకేతాలు ఇస్తున్నారు. 

'మా' సంస్థ ఎన్నికలు ముగిసిపోవడంతో ఈ వ్యవహారం చల్లారింది అనుకున్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ మా సంస్థ విషయాలు ఓపెన్ సీక్రెట్ గా మారిపోయి మళ్ళీ కొత్త రగడకు శ్రీకారం చుట్టాయి. తెలుస్తున్న సమాచారం మేరకు తెలంగాణ ప్రభుత్వ కళ్యాణ లక్ష్మీ పథకాన్ని పేద కళాకారులు కూడ వాడుకోవాలి అంటూ 'మా' సంస్థ తరపున పెద్ద ఎత్తున వాణిజ్య ప్రకటనలు ఇవ్వడమే కాకుండా ఈ ప్రకటనలకు సుమారు 10 లక్షల రూపాయలు మా సంస్థ ఖర్చు పెట్టడం మా కమిటీలోని చాలా మందికి ఇష్టం లేదు అని తెలుస్తోంది. 

దీనితో జరుగుతున్న పరిణామాలకు కలత చెంది ప్రముఖ దర్శకుడు నటుడు ఎస్.వి. కృష్ణారెడ్డికి నచ్చకపోవడంతో మా సంస్థలో ఆయన పదవికి రాజీనామా ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో మా ఎన్నికలు జరిగి కొద్దిరోజులు కూడ అవ్వకుండానే ఈసంస్థ రాజకీయాలు మళ్ళీ వేడెక్కడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. 

సాధారణంగా ఇండస్ట్రీలో బిజీగా ఉండే స్టార్స్ మా సంస్థ విషయాల గురించి పెద్దగా పట్టించుకోరు. అయితే పెద్దగా అవకాశాలు లేక ఒకప్పుడు లీడింగ్ స్టార్స్ గా ఇండస్ట్రీని షేక్ చేసిన నటీ నటులకు ఇప్పుడు 'మా' సంస్థ చిరునామాగా మారడంతో వారందరికీ సమయం ఎక్కువైపోయి ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తూ 'మా' సంస్థ పరువు తీస్తున్నారు అంటూ కొందరు నటీ నటులు అభిప్రాయ పడుతున్నట్లు టాక్..



మరింత సమాచారం తెలుసుకోండి: