గత కొంత కాలంగా నాని నటించిన చిత్రాలు వరుసగా హిట్ అవుతున్నాయి.  అయితే కృష్ణార్జునులు చిత్రం నుంచి మనోడికి బ్యాడ్ టైమ్ మొదలైంది.  నాగార్జున, నాని నటించిన దేవదాసు యావరేజ్ టాక్ వచ్చింది.  తాజాగా గౌత‌మ్ తిన్న‌నూరి దర్శకత్వంలో ‘జెర్సీ’చిత్రంలో నటించారు నాని.   ఈనెల 19న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే.   సితార ఎంట‌ర్‌టైన్ మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.  ట్రైలర్ రిలీజైన రోజు నుంచీ ఈ మూవీపై రక రకాల అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే ఈ చిత్రం పై ఫిలిమ్ వర్గాల్లో అప్పుడే టాక్ నడుస్తుంది.   నాని పర్శనల్ ఇమేజ్ కు సరిగ్గా సరిపోయే ఈ కథ నాని మార్కెట్ ని జస్టిఫై చేస్తుందని అంటున్నారు.


ఇక టాలీవుడ్ లో నడుస్తున్న టాక్ ప్రకారం.. ఈ చిత్రం లో మద్యతరగతి యువకుడు ఒక క్రికెటర్ గా ఎలా తన జీవితంలో గెలుపు సాధించాడు..యువకుడిగా ఉన్నపుడు ప్రేమను ఎలా పొందాడు..ఒక తండ్రి తన కొడుకుని ఎలా సంతోష పెట్టాడు అన్న కోణంలో సాగుతుందట.  ఈ మూడు కోణాల్లో నాని అద్భుతమైన నటన కనబర్చినట్లు కనిపిస్తుంది.   నాని అర్జున్‌ అనే క్రికెటర్‌ పాత్రలో నటించారు. 1990ల కాలం నేపథ్యంలో సినిమాను తెరకెక్కించారు.  ఫస్టాఫ్ మొత్తం కాలేజ్..అమ్మాయి తో లవ్ ఎఫైర్..సెకండాఫ్ పూర్తిగా కష్టాలు, కన్నీళ్లతో సాగుతుందట. 


ఈ చిత్రంలో క్లయిమాక్స్ చూస్తున్నంత సేపు ప్రేక్షకులు కన్నుమూయలేని పరిస్థితికి తీసుకు వస్తుందని చిత్ర యూనిట్ తెలిపారు.   నాని చిత్రాల్లో   కనపడే ఫన్ తక్కువగా భావోద్వేగాలకు ఎక్కువ పీట వేసారు. మజిలీ కు కాస్త దగ్గరలో ఈ చిత్రం ఉంటుందని అంటున్నారు.  అంతే కాదు బయిట ప్రచారం జరుగుతున్నట్లు  ర‌మ‌ణ లాంబ అనే క్రికెట‌ర్ జీవిత‌క‌థ‌తో తెర‌కెక్కించింది మాత్రం కాదు అలాగే  ఎవ‌రి బ‌యోపిక్ కాదని నాని క్లారిటీ ఇచ్చారు.  పూర్తిగా అర్జున్ అనే ఫిక్ష‌న‌ల్ రోల్ చుట్టూ తిరిగే చిత్రం.   ల‌వ్ స్టోరితో పాటు భార్య భ‌ర్త‌ల అనుబంధం, ఉద్వేగాల నేప‌థ్యం ఎక్కువ‌గా మైమ‌రిపిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: