ఎన్నికల కురుక్షేత్రంలో రెండవ అంకం ఒక గంట క్రితం ప్రారంభం అయింది. తెలుగు రాష్ట్రాలకు ఇరుగు పొరుగు రాష్ట్రాలుగా ఉండే తమిళనాడు కర్నాటక రాష్ట్రాలలో ఈరోజు ఎన్నికలు జరుగుతూ ఉండటంతో పాటు అనేకమంది తెలుగు ఓటర్లు ఉన్న ప్రాంతాలలో ఈరోజు ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో తెలుగు ఓటర్లను ప్రభావితం చేయడానికి టాలీవుడ్ సెలెబ్రెటీలు తమతమ స్థాయిలలో ప్రచారం చేస్తున్నారు.

ఈరోజు జరుగుతున్న ఎన్నికలలో తెలుగు సినిమా ప్రేక్షకులకు ఎంతో సన్నిహితమైన ప్రకాష్ రాజ్ సుమలతలు వేరువేరు స్థానాలలో ఏ పార్టీకి సంబంధం లేకుండా ఇండిపెండెంట్స్ గా పోటీ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థుతులలో సుమలతకు అత్యంత సన్నిహితుడైన మోహన్ బాబు చేసిన ట్విట్ సంచలనంగా మారింది. 

సుమలత పోటీ చేస్తున్న మాండ్య స్థానంలో దేవగౌడ మనవడు కన్నడ హీరో నిఖిల్ గౌడా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే అక్కడ ప్రచారం చేసి నిఖిల్ కు ఓట్లు వేయమని అక్కడి తెలుగు ఓటర్లను అభ్యర్ధించారు. ఇలాంటి పరిస్థుతులలో ఎవరూ ఊహించని విధంగా మోహన్ బాబు రంగంలోకి దిగి చంద్రబాబును టార్గెట్ చేస్తూ ఒక ట్విట్ చేసాడు. 'చంద్రబాబు ఒకప్పుడు ముఖ్యమంత్రి, ఇప్పుడు కాదు. ఇకపై కాబోరు' అంటూ మోహన్‌బాబు, ట్విట్టర్‌ వేదికగా చేసిన కామెంట్స్‌ ఇప్పుడు అందర్నీ విస్మయానికి గురిచేస్తున్నాయి. 

ఇంకా ఎన్నికల ఫలితాలు రాకుండానే మోహన్‌ బాబు చంద్రబాబును మాజీ ముఖ్యమంత్రిగా సంభోదించడం హాట్ టాపిక్ గా మారింది. దీనితో వచ్చే నెల వెల్లడి అయ్యే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు అప్పుడే మోహన్ బాబుకు తెలిసిపోయాయ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే కర్నాటక లోని తెలుగు ఓటర్లు చంద్రబాబు మాటకు విలువ ఇస్తారా లేదా మోహన్ బాబు ట్విట్ ను ఫాలో అవుతారా అన్నది వేచి చూడాలి..   


మరింత సమాచారం తెలుసుకోండి: