తెలుగు ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ అలీ ప్రస్తుతం విదేశాల్లో తన కుంటుంబంతో ఎంజాయ్ చేస్తున్నారు.  ఇటీవల ఆయన వైసీపీలో జాయిన్ అయిన విషయం తెలిసిందే.  ఈ పార్టీ తరుపు నుంచి ప్రచారం కూడా చేశారు.  బాలనటుడిగా కెరీర్ ప్రారంభించిన అలి ప్రస్తుతం స్టార్ కమెడియన్ గా  కొనసాగుతున్నారు.  గతంలో కొన్ని చిత్రాల్లో హీరోగా నటించినప్పటికీ తనకు కమెడియన్ గా నే సెట్ అవుతుందని అలాగా నటిస్తున్నారు. 

ఓ వైపు వెండి తెరపై నటిస్తూనే బుల్లితెరపై తన సత్తా చాటుతున్నారు.  పలు కార్యక్రమాల్లో జడ్జిగా వ్యవహరిస్తు.. యాంకర్ గా కొనసాగుతున్నారు.  తాజాగా  ఫ్యామిలీతో క‌లిసి లండ‌న్ టూర్‌కు వెళ్లాడు అలీ. భార్య , పిల్ల‌ల‌తో క‌లిసి లండ‌న్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు.

పిల్ల‌లకు వేస‌వి సెల‌వులు కావ‌డం, ఎన్నిక‌ల ప్ర‌చారంతో పాటు, సినిమా షూటింగ్‌లు కూడా ఏమి లేక‌పోవ‌డంతో ఇలా ఫ్యామిలీతో క‌లిసి ఎంజాయ్ చేస్తున్నాడు. అలీ త‌న భార్య, పిల్ల‌లతో క‌లిసి లండ‌న్ విధుల్లో ఎంజ‌య్ చేస్తు దిగిన ఫోటోలు ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: