ఈనాటి తరానికి 1995 లో తూర్పుగోదావరి జిల్లాలోని పాసర్లపూడి గ్రామం దగ్గర వచ్చిన ఓఎన్ జీసి బ్లౌఅవుట్  సంఘటన సృష్టించిన కలకలం తెలియదు. ఇండియాలో బిగ్గెస్ట్ బ్లౌఅవుట్ సంఘటనగా జరిగిన ఆ సంఘటనతో కోనసీమ ప్రాంతంలోని 65 గ్రామాలు నష్టపోవడమే కాకుండా సుమారు 1500 కుటుంబాలను అత్యంత హడావిడిగా ఆ బ్లౌఅవుట్ ప్రాంతం నుండి ఖాళీ చేయించారు. 

ఇప్పుడు ఆ సంఘటనను ‘మహర్షి’ మూవీలో యథాతధంగా భారీ గ్రాఫిక్స్ తో చూపించబోతున్నట్లు సమాచారం. అప్పటి పరిస్తుతులను నేటితరం ప్రేక్షకులకు కళ్ళకు కట్టే విధంగా ‘మహర్షి’ కథతో జత చేసి వంశీ పైడిపల్లి చూపించబోతున్నాడు. 

అయితే అప్పటి బ్లౌఅవుట్ సంఘటనను ‘మహర్షి’ సినిమాకు ఎందుకు వాడారు అన్న విషయం పై క్లారిటీ లేకపోయినా బ్లౌఅవుట్ సీన్స్ అన్నీ చాల సహజంగా తీసినట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా ‘మహర్షి’ సినిమాకు సంబంధించిన మూడవ పాటను నిన్న సాయంత్రం విడుదల చేసారు. 

అయితే ఈపాట ట్యూన్ కూడ పెద్దగా అభిమానులకు కనెక్ట్ కాలేదు అన్న వార్తలు వస్తున్నాయి. దీనితో ‘మహర్షి’ మూవీలోని పాటలు అన్నీ ఇలాగే ఉంటాయా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.  130 కోట్ల బిజినెస్ జరుపుకున్న మూవీ ఆడియో క్లిక్ అవ్వకపోతే ఆమూవీ ఫలితం పై తీవ్ర ప్రభావం చూపెడుతుంది. దీనితో ఈమూవీ ప్రమోషన్ ను అదేవిధంగా ఈమూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను డిఫరెంట్ కాన్సెప్ట్ తో చేయకుండా రొటీన్ గా నిర్వహిస్తే ఈమూవీ పై అంచనాలలో తేడా వచ్చి బయ్యర్లు కోలుకోలేని నష్టాలు వచ్చే ఆస్కారం ఉంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి..
 


మరింత సమాచారం తెలుసుకోండి: