నిన్నటిరోజున విడుదలైన ‘జెర్సీ’ కి మొదటిరోజు మొదటి షో నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా ఈమూవీ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈమూవీ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ గర్వించే ఒకమంచి సినిమాగా మారి ఉండేది అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా స్పోర్ట్స్ డ్రామాగా తీయబడ్డ ఈమూవీ విషయంలో కొన్నిచోట్ల చేసిన తప్పులు విమర్శకుల కంట పడ్డాయి. 

ఎమోషన్లతో ప్రేక్షకుల్ని కదిలించే దృశ్యాలు చాలానే ఈ మూవీలో ఉన్నా క్రికెట్ విషయంలో ఈమూవీలో చేసిన పొరపాట్లు ఈమూవీని చూస్తున్న క్రికెట్ అభిమానులకు కనిపిస్తాయి. ముఖ్యంగా ఈమూవీలో హీరో 36 ఏళ్ల వయస్సులో క్రికెట్ బ్యాట్ తో రీ ఎంట్రీ ఇస్తాడు. అయితే పదేళ్ళ పాటు క్రికెట్ కు దూరంగా ఉన్న నాని పాత్ర గ్రౌండ్ లోకి ఎంట్రీ ఇవ్వగానే పదేళ్లు క్రికెట్ బ్యాటే పట్టని నాని అర్జున్ పాత్ర నేరుగా వచ్చి రంజీ ట్రోఫీలో ఆడుటమే కాకుండా ఫోర్లు సిక్సర్లు లతో దుమ్ము దులుపుతూ ఆడటం చూసినవారికి పదేళ్ళపాటు క్రికెట్ కు దూరంగా ఉన్న నాని పాత్ర అంత అద్భుతంగా ఎలా ఆడుతున్నాడు అన్న సందేహాలు కలుగుతాయి. 

సాధారణంగా టాప్ హీరోల సినిమాలలో హీరోలు కత్తులు గొడ్డళ్ళు పుచ్చుకుని విలన్స్ తల నరుకుతున్నట్లుగా నాని క్రికెట్ బ్యాట్ తో విద్వంసం చేయడం అర్జున్ పాత్ర ఎలివేషన్ కు బాగున్నా పది సంవత్సరాల గ్యాప్ తో వచ్చిన ఒక వ్యక్తి అంత గొప్పగా ఎలా ఆడేస్తున్నాడు అన్న సందేహాలు కలుగుతాయి. ఇది చాలదు అన్నట్లుగా ఈమూవీలో రంజీ మ్యాచ్‌లను వాస్తవానికి దగ్గరగా చూపించకపోవడం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మామూలుగా రంజీ మ్యాచ్‌లు డేలో జరుగుతాయి. 

అయితే ఈమూవీలో ఈ రంజీ మ్యాచ్ లను డై‌ అండ్ నైట్‌లో నిర్వహిస్తారు. అంతేకాదు ఈసినిమాలో చూపించన చాలా మ్యాచ్‌ లకు స్టేడియం అట్మాస్ఫియర్ ఉండేలా చూసుకోకుండా ఎక్కడా ప్రేక్షకులను చూపించకుండా ఎక్కువగా క్లోజప్ షాట్లతో నైట్ ఎఫెక్ట్‌ లో చూపించడంలో రంజీ మ్యాచ్ లు జనం లేకుండా ఎందుకు ఉంటాయి అన్న సందేహాలు క్రికెట్ గురించి తెలిసిన ప్రేక్షకులకు ఆలోచన వస్తుంది. నానీ ఈసినిమాలో ఎంత అద్భుతంగా నటించినా ఈసినిమాకు అవార్డ్ లు ఇవ్వాలి అంటే ఇలాంటి చిన్న విషయాలు కూడ పరిశీలిస్తారు. దీనికితోడు ఈసినిమా ‘కాంచన 3’ తో కాకండా సోలోగా విడుదల అయి ఉంటే ఈమూవీకి మరింత మంచి ఓపెనింగ్ కలక్షన్స్ వచ్చి ఉండేవి అన్న అభిప్రాయం ఇండస్ట్రీ వర్గాలు వ్యక్త పరుస్తున్నాయి



మరింత సమాచారం తెలుసుకోండి: