రాజకీయ నాయకులు ఫిలిం సెలెబ్రెటీలు చేసే కామెంట్స్ లో తప్పులు వెతుకుతూ నెగిటివ్ కామెంట్స్ పెరిగిపోతున్న పరిస్థుతులలో యధాలాపంగా ఎవరైనా ఏదైన ఒక కామెంట్ చేస్తే ఆ కామెంట్స్ ను టార్గెట్ చేసేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాన్ విషయంలో ఇది మరీ ఎక్కువ.

ఇలాంటి సందర్భంలో మెగా బ్రదర్ నాగబాబు గత కొద్ది రోజులుగా ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్ధులు చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థుతుల పై తన వెబ్ ఛానల్ లో చేసిన కామెంట్స్ అనుకోకుండా మళ్ళీ పవన్ వ్యతిరేకులకు ఒక అవకాశంగా మారింది. విద్యార్ధుల ఆత్మహత్యలకు ప్రభుత్వ విధానాలు కార్పోరేట్ కాలేజీల తీరు ఎడ్యుకేషన్ సిష్టంలో లోపాలతో పాటు తల్లి తండ్రుల ప్రవవర్తన కూడ కారణం అంటూ నాగబాబు లోతైన విశ్లేషణలు చేసాడు.

అంతటితో ఆగకుండా తాను ఎల్ ఎల్ బి చదివాననీ చిరంజీవి డిగ్రీ చేసాడనీ ఒక చెల్లెలు ఎమ్ బి బిఎస్ మరొక చెల్లెలు డిగ్రీ చదివారు అంటూ పవన్ కళ్యాణ్ ఐటి సబ్జెక్ట్ లో డిగ్రీ హోల్డర్ అంటూ చెప్పాడు. దీనితో నాగబాబు మరొకసారి పవన్ వ్యతిరేకులకు విమర్శలు చేయడానికి  ఒక అస్త్రాన్ని ఇచ్చినట్లు అయింది.  
 
ఈమధ్య జరిగిన ఎన్నికలలో పవన్ ఇచ్చిన అఫిడవిట్ లో తను పదో తరగతి పాసయ్యానని స్పష్టంచేస్తే ఇప్పుడు నాగబాబు చెపుతున్న ఐటి సబ్జెక్ట్స్ లో పవన్ ఎప్పుడు డిగ్రీ చేసాడు అంటూ వ్యతిరుకులు కామెంట్స్ మొదలు పెట్టేసారు. పవన్ పై కామెంట్స్ చేయడానికి ఒక వ్యతిరేక వర్గం ఎప్పుడూ రెడీగా ఉండే పరిస్థుతులలో అనుకోకుండా నాగబాబు తన కామెంట్స్ తో పవన్ ను ఇరికించాడు అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: