అప్పుడప్పుడు సినీ తారలు ఫోటొ షూట్లంటూ అంగాంగ ప్రదర్శన చేసి యువతను కై-పెక్కించటమే కాదు, అవకాశాల కోసం ఎరవేయటానికి వాడేస్తుంటారు. తామెప్పుడూ ప్రజల మనసుల్లో నిలవాలని మోష్ట్ పాపులర్ హీరోయిన్స్ అనుకుంటే అవకాశాలు రానివారు అవకాశాల కోసం అందాలు ఆరేస్తారు. అలాంటి మూడు అందాల అంగాంగ ప్రదర్శనలు బాగా ప్రచారంలో ఉన్నాయి మీడియాలో. వాటిని చూస్తూ ఎంజాయ్ చెయ్యండి ఒకే చోట. 
 

పూజ హెగ్డే పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉంటారా? దాదాపుగా ఉండరు. ఒకవేళ నిజంగా ఉన్నారంటే వారు మహర్షులే.  ఆ మహర్షుల సంగతేమో కానీ ఈ భామ సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.  అంతే కాదు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రభాస్ - సినిమాలో కూడా హీరోయిన్ తనే. అయితే ఈ భామకు సమ్మర్ టెంపరేచర్లు తక్కువగా ఉన్నాయనే అనుమానం వచ్చిందేమో కానీ ఈమధ్య తన హాటు ఫోటో షూట్లతో ఆ వేడిని మరింత పెంచే ప్రయత్నం చేస్తోంది. రీసెంట్ గా ఈ భామ ఒక ఈవెంట్ కు హాజరయింది. 

మామూలుగానే అందచందాల విందు చేస్తూ ఉండే డ్రెస్సులు ధరించే పూజ ఏదైనా ప్రత్యేకమైన సందర్భం ఉంటే ఊరుకుంటుందా? ఊహు.. అస్సలు ఊరుకోదు.  యమా హాటుగా డ్రెస్సు ధరించింది.  నెట్ లాంటి క్లాత్ తో డిజైన్ చేసిన గౌన్ ధరించింది. భారీగా వీ నెక్ ఉండే డ్రెస్, పైగా చాలా చోట్ల పారదర్శకంగా ఉంది. ఆ డిజైనర్..టైలర్ ఎవరో కానీ పెద్ద మనసుతో వీ-నెక్ ను పోలవరం డ్యామ్ అంత పెద్దదిగా ఉంచాడు. ఇంకేముంది అందాల ఫ్లడ్ గేట్లన్నీ ఒకేసారి ఎత్తేసినట్టుగా అయిపోయింది. దానికి తోడు పూజ కూడా ఒక ఖజురహో శిల్పంలా పోజిచ్చింది.. ఒక సెన్సువల్ ఎక్స్ ప్రెషన్ పెట్టింది. 

Related image

అసలే జిమ్ములో రెగ్యులర్ గా కఠినమైన కసరత్తులు చేస్తూ పూజ తన ఒంపుసొంపులను ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటుంది. పూలను ఆకులను అస్తమిస్తున్న సూర్యుడిని అడ్డం పెడితే నెటిజనులు ఏమైపోవాలి?


రాశి ఖన్నా: అందాలను పోగేస్తే హైట్, వెయిట్, లుక్ అన్ని పెర్ఫెక్ట్ గా ఉంటె, గ్లామర్ ప్రపంచంలో పక్కా రాణించవచ్చు.  ఇలా రాణించిన తారామణులు ఎందరో ఉన్నారు. వారి లిస్ట్ లో ఇప్పుడు మరో తార చేరింది.  అందాలను రాశి పోసినట్టుగా ఉండే ఈ భామ ఢిల్లీ నుంచి టాలీవుడ్ లు వచ్చింది.  ఊహలు గుసగుసలాడే అంటే కుర్రకారు గుండెల్లో తొలిప్రేమను పుట్టించిన రాశి ఖన్నా ఆ తరువాత చేసిన ఒకటి రెండు సినిమాలు క్లిక్ కాలేకపోయాయి.


ప్రస్తుతం రాశి ఖన్నా 'వెంకిమామ' లో నాగచైతన్యతో ఆడిపాడనుంది. మల్టీస్టారర్ సినిమా కావడంతో పాటు పూర్తి వినోదభరితంగా సినిమాను తెరకెక్కిస్తుండటంతో సినిమాపై నమ్మకం పెరిగింది.  ఇక రీసెంట్ గా ఈఅమ్మడు కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.  గోధుమ రంగులో ఉన్న స్కర్ట్ తో ఉన్న ఫోటో.  ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ అవుతూ ట్రెండ్ అవుతున్నది.

Related image


ఇషా రెబ్బా: తెలుగు సినీపరిశ్రమ తెలుగమ్మాయిలను హీరోయిన్లుగా ఎంకరేజ్ చేయదనే భావన తెలుగు వారిలో ఉంది. మనోళ్లకు ముంబై నుంచి దిగుమతి అయ్యే తార లంటేనే మక్కువ ఎక్కువ. ముంబై హీరోయిన్లు దిగుమతి తగ్గిపోయి ఈ మధ్య కాలంతో కేరళ, తమిళనాడు నుంచి వచ్చే హీరోయిన్లు టాలీవుడ్ లో రాణిస్తున్నారు. గత పది, పదిహేనేళ్లు గా కేరళ, తమిళ భామల డ్యామినేషన్ తెలుగునాట కొనసాగుతూ ఉంది. అప్పుడప్పుడు మాత్రం ఉత్తరాది నుంచి హీరోయిన్లను దిగుమతి చేసుకొంటూ ఉన్నారు.

అంతే కానీ, తెలుగమ్మాయిలకు మాత్రం తెలుగుసినిమాల్లో అవకాశాలు దక్కవు. అప్పుడప్పుడు తెలుగు అమ్మాయిలు తమిళ, మలయాళ సినిమాల్లో అవకాశాలు పొంది రాణిస్తూ ఉంటారు. తమిళనాడు లోనూ, కేరళలోనూ కొంతమంది తెలుగు హీరోయిన్లు మంచి గుర్తింపును పొందుతూ ఉంటారు. అయితే వారికి తెలుగునాట మాత్రం అవకాశాలు అంతంతమాత్రమే. ఇదే కోవకు చెందిన నటీమణి ఇషా రెబ్బా. పేరులో తెలుగుదనం లేకపోయినా, ఈ అమ్మాయి తెలుగమ్మాయే. పలుసినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.

Image result for photo shoot multi heroines images Rashi khanna Eesha Rebba Pooja hegde

అయితే గ్లామరస్ గుర్తింపు మాత్రం ఇంకా దక్కలేదు. ఆ ప్రయత్నమే చేస్తున్నట్టుగా ఉంది ఇషా. అందులో భాగంగా ఈ ఇలా హాట్ ఫొటో షూట్ లో దర్శనమిచ్చింది. క్లీవేజ్ అందాలను ఆరబోసింది. అందరి కన్నూ తన మీద పడేలా చేసుకుంటోంది. మరి ఇలాంటి ఫొటో షూట్స్ తో ఇషాకు గ్లామరస్ గుర్తింపు వచ్చేనా.. ఈమెకు స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కేనా.. వెయిట్ అండ్ సీ!

మరింత సమాచారం తెలుసుకోండి: