ప్రస్తుతం టాలీవుడ్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేక్షకులు అందరిని తన వైపునకు తిప్పుకుంటున్న సినిమా దర్శక ధీరుడు రాజమౌళి ఆర్ ఆర్ ఆర్. బాహుబలి లాంటి ప్రతిష్టాత్మక సినిమాల తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై టాలీవుడ్‌లో లెక్కకు మిక్కిలిగా అంచనాలు ఉన్నాయి.  టాలీవుడ్ టాప్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్,  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కాంబినేషన్ సెట్ చేయడంతోనే రాజమౌళి సగం హిట్ కొట్టేశాడు. ఎన్టీఆర్ కొమరం భీంగా,  రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌ల‌ను సైతం రాజమౌళి ప్రకటించిన సంగతి తెలిసిందే. 


రామ్ చరణ్ సరసన బాలీవుడ్ హాట్ హీరోయిన్ అలియాభ‌ట్‌ను ఎంపిక చేసిన రాజమౌళి ఎన్టీఆర్ పక్కన విదేశీ హీరోయిన్ డైసీ ఎడ్గర్ జోన్స్‌ నటిస్తుందని చెప్పారు. యూర‌ప్‌లో ఆమె బాగా పాపుల‌ర్ సీరియ‌ల్ హీరోయిన్‌. ఎన్టీఆర్ పక్కన విదేశీ హీరోయిన్ అనగానే ఆ జంట ఎలా ఉంటుందో అన్న ఉత్సుకత సహజంగానే తెలుగు ప్రేక్షకులు అందరిలోనూ నెలకొంది. తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ పక్కన ఈ ప్రాజెక్టు కోసం ఎంపిక చేసిన డైసీ తప్పుకుంది. కొమరంభీం పాత్ర ప‌క్క‌న స‌రిగ్గా సెట్ అయ్యే హీరోయిన్ కోసం రాజమౌళి వెతికి వెతికి పట్టుకున్న డైసీ ఇప్పుడు షాక్ ఇవ్వడంతో  ఎన్టీఆర్ కోసం మళ్లీ హీరోయిన్ల వేటలో పడ్డాడు రాజమౌళి. 


ప్రభాస్ సాహో సినిమాలో నటిస్తున్న బాలీవుడ్ బామ శ్రద్ధ కపూర్ అయితే ఎలా ఉంటుందని ఆమె పేరు పరిశీలిస్తున్నట్టు టాక్. అయితే బాలీవుడ్‌లో పలు సినిమాల్లో బిజీగా ఉన్న శ్రద్ధ డేట్స్ ఎంత వరకు ఖాళీగా ఉంటాయి అన్న సందేహం కూడా ఉందట. ఈ క్రమంలోనే రాజమౌళి ఎన్టీఆర్‌కు ఏ హీరోయిన్ సెట్ కాకపోవడంతో ఎవరు ? దొరుకుతారా అని తల పట్టుకునట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ హీరోయిన్ సెట్ అయితే ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్టు పట్టాలు ఎక్కుతుంది. మరి ఆ భామ‌ ఎక్కడ దొరుకుతుందో ఏమో..!


మరింత సమాచారం తెలుసుకోండి: