అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుగా ఉంది నేచురల్ స్టార్ నాని తాజా సినిమా జెర్సీ బాక్సాఫీస్‌ పరిస్థితి.  నాని జెర్సీ సినిమాకు విమర్శల నుంచి భారీగా ప్రశంసలు వచ్చాయి. రివ్యూ రేటింగ్ అదిరిపోయాయి నాని మరోసారి తన సహజసిద్ధమైన నటనతో అదరగొట్టిన నాని  అని ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారు. టాలీవుడ్ లో  స్టార్ హీరోలందరూ జెర్సీ సూపర్ అంటూ ట్వీట్లు కూడా చేశారు.సినిమా అలా విడుదల అయిందో లేదో వెంటనే ఈ సినిమాను ఇతర భాషల్లో రీమేక్ లు చేస్తామంటూ ఇతర భాషల హీరోల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది.  అయితే ఇవేవీ జెర్సి సినిమాకు కలెక్షన్ల విషయంలో  యూజ్ అవ్వ‌లేదు. జెర్సీ సినిమా  క్లాస్ సినిమాగా టాక్ రావడంతో మాస్ జనాలు ఈ సినిమా పెద్దగా పట్టించుకున్నట్టు కనపడటం లేదు. 


తొలి వారాంలో లారెన్స్ కాంచన 3 సినిమాకు సరిసమానంగా జెర్సీ సినిమా కలెక్షన్లు ఉండడంతో సినిమా కొన్న బయ్యర్లు ఆందోళన చెందుతున్నారు. లారెన్స్ కాంచన 3 సినిమా బి, సి సెంటర్లలో అదరగొడుతోంది. మాస్ ప్రేక్షకులు ఈ సినిమాను బాగా చూస్తున్నారు. ఇక కాంచ‌న సీరిస్ సినిమాల‌కు మాస్‌లో పిచ్చ క్రేజ్ ఉంది. అదే ఇప్పుడు కాంచ‌న 3కు ప్ల‌స్ అవుతోంది. అదే టైంలో వారు జెర్సీ పై పెద్దగా ఆసక్తి చూపుతున్నట్టు లేదని కలెక్షన్లు చెబుతున్నాయి.  అలాగే ఏ సెంటర్లలో జెర్సీ సినిమాను రెండేసి థియేటర్లలో విడుదల చేయడం కూడా కలెక్షన్లపై ప్రభావం పడినట్టు తెలుస్తోంది.  సోమవారం నుంచి కాంచన 3 వసూళ్లు కాస్త డల్ అయినట్టు ఉన్న తొలి వారంలో ఆ సినిమాకు ఢోకా లేదని తెలుస్తోంది. 


ఇక జెర్సీకి తొలి వారం గండం లారెన్స్ కాంచన 3 రూపంలో ఉంటే మరుసటి వారం నుంచి 4 ఎవెంజ‌ర్స్ ఎండ్ గేమ్ రూపంలో మళ్లీ దెబ్బ పడనుంది.  ఇప్పటికే మల్టీప్లెక్స్ ఆడియన్స్ అంతా ఈ హాలీవుడ్ సినిమాపైనే దృష్టి పెట్టినట్టు అడ్వాన్స్ బుకింగ్ లు చెప్పేస్తున్నాయి. ఏ, బి, సి సెంటర్స్‌లో అవెంజర్స్ తెలుగు డబ్బింగ్ జెర్సీ వ‌స్సులను కొల్లగొట్టడం ఖాయం అనిపిస్తుంది. తొలి రెండు మూడు రోజులు ఇప్పటికే ఎవెంజర్స్ మ‌ల్టీఫ్లెక్స్‌ బుకింగ్‌లు  భారీ ఎత్తున ఉండడంతో జెర్సీకి రెండో వారాంతంలోనూ టైం పెద్దగా కలిసి వచ్చేట్టు కనపడటం లేదు. ఏదేమైనా సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న వసూళ్లు మాత్రం అనుకున్న రేంజ్ లో రాకపోవడం దానికి కాస్త నిరాశ‌గానే ఉన్నట్టు టాక్.


మరింత సమాచారం తెలుసుకోండి: