అదృష్టం ఉంటే ఎలాంటి ప్రమాదం అయినా సులువుగా తప్పించుకుని క్షేమంగా బయటపడవచ్చు అన్న విషయం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు శివాజీ రాజ విషయంలో మరొకసారి రుజువైంది. తెలుస్తున్న సమాచారం మేరకు క్రితం వారం జరిగిన శ్రీలంక లోని కొలంబో పట్టణంలో జరిగిన బాంబుల దాడిలో శివాజీ రాజ చిక్కుకుని ప్రాణాలు పోగొట్టుకోవలసిన పరిస్థితి నుండి త్రుటిలో తప్పించుకున్నాడు.

గతవారం శివాజీ రాజ హైదరాబాద్ లోని తన స్నేహితులతో కలిసి శ్రీలంక వెళ్ళడానికి టూర్ ఫిక్స్ చేసుకోవడమే కాకుండా సరిగ్గా బాంబుల దాడి జరిగిన రోజున కొలంబో పట్టణంలో ఉండే విధంగా చాల ముందుగానే ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆఖరి నిముషంలో శివాజీ రాజ చుట్టాల ఇంటిలో ఒక ఫంక్షన్ ఉండటంతో తన స్నేహితులతో కలిసి వెళ్ళవలసిన ఆ టూర్ నుండి శివాజీ రాజ ఒక్కడు విరమించుకున్నాడు. 

అయితే ముందుగా ప్లాన్ చేసుకున్న టూర్ కావడంతో శివాజీ రాజ స్నేహితులు అంతా ఆ టూర్ కు వెళ్ళారు. అంతేకాదు బాంబు బ్లాస్ట్ లు జరిగిన హోటల్ లోనే వీరంతా బస చేసారు. అనుకోకుండా జరిగిన ఈ ప్రమాదంలో శివాజీ రాజ స్నేహితులు మరియు బంధువులలో ఒకరు మరణిస్తే మరొకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలు అయ్యారు.  

శివాజీ రాజ ఈ ప్రమాదం నుండి తప్పించుకున్నా అతడి శ్రీలంక టూర్ టూర్ విషయం ముందుగానే తెలిసిన బంధువులు స్నేహితులు వరసపెట్టి ఫాన్స్ చేస్తూ ఉండటంతో తాను శ్రీలంక టూర్ కు వెళ్ళలేదు అంటూ శివాజీ రాజ మీడియా ప్రకటన ఇవ్వడమే కాకుండా తాను క్షేమంగా ఉన్నాను అంటూ అందరికీ తెలియచేసాడు. ఈమధ్య కాలంలో ‘మా’ అసోసియేషన్ రాజకీయాలతో విపరీతంగా మీడియా వార్తక్లలో కనిపించిన శివాజీ రాజ శ్రీలంక టూర్ కు సంబంధించిన వార్త కావడంతో మీడియా సంస్థలు కూడ ఈ వార్తను హైలెట్ చేసాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: