క్రితం సంవత్సరం దసరాకు విడుదల అవుతుంది అనుకున్న ‘సైరా’ ఈ ఏడాది సమ్మర్ రేస్ ను కూడ మిస్ చేసుకుని ఎట్టి పరిస్తుతులలోను ఈ సంవత్సరం దసరాకు విడుదలై సంచలనాలు క్రియేట్ చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. ఈ మూవీకి ఏర్పడ్డ క్రేజ్ రీత్యా బయ్యర్ల నుండి భారీ బిజినెస్ ఆఫర్లు వస్తున్నా ఈ మూవీ విడుదల పై క్లారిటీ లేకపోవడంతో చరణ్ ఆ ఆఫర్లను ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్లు టాక్.

తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీకి సంబంధించి ఒకపాట మినహా మిగతా షూటింగ్ అంతా ఈ నెలాఖరుకు పూర్తి అవుతుందని టాక్. అయితే ఈసినిమాకు సంబంధించి అత్యంత కీలకమైన గ్రాఫిక్ వర్క్స్ చేసే బాధ్యతను ఒక కంపెనీకి కాకుండా పని వేగంగా జరగాలి అన్న ఉద్దేశ్యంతో ఈ గ్రాఫిక్స్ వర్క్ ను మిక్కలుముక్కలుగా చేసి రకరకాల గ్రాఫిక్ కంపెనీలకు ఇచ్చినట్లు  తెలుస్తోంది. 

ఈ కంపెనీలు అన్నీ అధికభాగం రష్యా ఉక్రెయిన్ దేశాల్లోని కంపెనీలు అని తెలుస్తోంది. పక్కాగా టైమ్ బౌండ్ ప్రకారం వర్క్ డెలివరీ ఇస్తామని ఈ కంపెనీలు అగ్రిమెంట్ చేసుకున్నా క్వాలిటీ మైంటైన్ చేస్తూ ఎంతవరకు ఆ కంపెనీలు తాము ఇచ్చిన మాటను నిలబెట్టు కుంటాయి అన్న విషయంలో చరణ్ కు చాల అనుమానాలు ఉన్నట్లు టాక్. 

ముఖ్యంగా ఈమూవీ గ్రాఫిక్ వర్క్స క్వాలిటీ చెక్ కోసం సమయం ఎక్కువ అయినా ఎక్కడా అశ్రద్ధ చేయకూదదనీ చరణ్ స్థిర నిర్ణయంలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. రాబోయే దసరాకు ఇంకా ఐదు నెలలు సమయం ఉన్నా ఈ సమయం ‘సైరా’ గ్రాఫిక్స్ కు సరిపోదు అనీ చరణ్ అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. దీనితో పైకి దసరా సీజన్ ను మిస్ కాము అని చెపుతున్నా లోలోపల సంక్రాంతి ఆప్క్షన్ కూడ చరణ్ మైండ్ లో ఉంది అని అంటున్నారు. మరి ‘సైరా’ విషయంలో ఏమవుతుందో చూడాలి..   


మరింత సమాచారం తెలుసుకోండి: