హాలీవుడ్ బ్యూటీ సన్నీలియోన్  బాలీవుడ్ బిగ్ బాస్ తో పాల్గొన్న తర్వాత బాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.  అయితే ఫోర్న్ స్టార్ అయిన సన్నీలియోన్ గ్లామర్ పాత్రలు నటించడం  పెద్ద విషయం కాకపోవడంతో..ఆ తరహా పాత్రల్లో నటించింది.  దాంతో ఆమెపై చాలా మంది విమర్శలు చేశారు..ఫోర్న్ స్టార్ ని ఇండస్ట్రీలోకి తీసుకోవడం ఏంటీ అని ప్రశ్నించారు. 


తాను ఫోర్న్ ప్రపంచంలో నుంచి బయటకు వచ్చానని..అది తల్చుకుంటేనే జీవితంపై విరక్తి వస్తుందని ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పింది సన్నీలియోన్.  హింది, తెలుగు, తమిళ, కన్నడ,మళియాళ భాషల్లో ఐటమ్ సాంగ్ లో నటిస్తుంది.  తాజాగా ఓ ఇంటర్వ్యూలో సన్నీలియోన్ కన్నీటి పర్యంతం అయ్యింది. 


తనకు సహాయకుడిగా పనిచేసిన ప్రభాకర్ చాలామంచి వ్యక్తని పేర్కొన్న సన్నీ.. అతడిని బతికించుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని పేర్కొంది. ప్రభాకర్‌కు భార్య, పిల్లలు, వయసు మీదపడిన తల్లి ఉన్నారని, వారికి అతడే ఆధారమని ఆవేదన వ్యక్తం చేసింది.  కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఆయనను బతికించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశామని అన్నారు. తన భర్త డేనియల్‌తో కలిసి నిధుల సేకరణకు ప్రయత్నించామని వివరించింది.  


ఇప్పుడు సన్నీలియోన్ పై ఎన్నో విమర్శలు వస్తున్నాయి. సన్నీ రూ.1.38 కోట్లు పెట్టి ఖరీదైన కారు కొనుగోలు చేయగలదు కానీ రూ.20 లక్షలు ఖర్చు చేసి ప్రభాకర్‌కు చికిత్స చేయించలేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఆమె లగ్జరీ జీవితానికి వినియోగించే డబ్బు కాస్త పక్కన బెడితే అతడికి చికిత్స చేయించి ఉండేదని..కోట్లాది రూపాయలు సంపాదిస్తున్న సన్నీ.. ప్రభాకర్ కోసం డొనేషన్లు అడగడం సిగ్గుచేటని మరొకరు కామెంట్ చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: