సినీనటుడు ప్రభాస్ కు సంబందించి హైదరాబాద్ శివార్లలో ఓ భూవివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఆయన కోర్టుకు కూడా వెళ్లిన సంగతి అప్పట్లో బాగా వార్తల్లో నలిగింది. ఇప్పుడు ఈ విషయంలో హైకోర్టు కాస్త ప్రభాస్ కు అనుకూలంగా తీర్చు ఇచ్చింది. 


హైదరాబాద్ లోని రాయదుర్గం వద్ద ప్రభాస్‌ స్వాధీనంలో ఉన్న భూమి నుంచి ఖాళీ చేయించడం చట్ట విరుద్ధమని హైకోర్టు తన తాజా తీర్పులో తెలిపింది. ఈ విషయంలో ప్రభుత్వం చట్టం నిర్దేశించిన విధి విధానాలను అనుసరించలేదని కామెంట్ చేసింది. అయితే ఇది ప్రభాస్‌ కొంత వరకూ మాత్రమే ఉరట.

ఎందుకంటే.. 1958 నుంచి ఇక్కడి భూములపై వివాదం నడుస్తున్న నేపథ్యంలో తిరిగి ఆ భూమిని ప్రభాస్‌కు స్వాధీనం చేయాలని ఆదేశించలేమని కోర్టు కామెంట్ చేసింది. భూ క్రమబద్దీకరణకు అతను దరఖాస్తు పెట్టుకుంటే, విస్తృత ప్రజాప్రజాప్రయోజనాలు, ప్రభుత్వ ప్రయోజనాల దృష్ట్యా దాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఈ తీర్పు కాపీ అందుకున్న 8 వారాల్లో ఆ దరఖాస్తుపై తగిన ఉత్తర్వులు జారీ చేయాలంది. ఏళ్ల నుంచి ఉన్న సుదీర్ఘ భూ వివాదాన్ని ప్రభుత్వం పరిష్కరించినట్లవుతుందన్న ఉద్దేశంతో ఈ ఆదేశాలు ఇస్తున్నామని హైకోర్టు పేర్కొంది. మరి దీనిపై ప్రభాస్‌ ఎలా ముందుకెళ్తాడో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: