ఏ ముహూర్తాన అక్కినేని ఇంట‌ కోడలుగా అడుగుపెట్టిందో గాని చెన్నై స్వీటీ సమంత రేంజ్ మారిపోయింది. అక్కినేని వారసుడు నాగచైతన్యను పెళ్లాడిన తర్వాత సమంత వరుసగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టేస్తోంది. గత ఏడాది సూపర్ హిట్లు అందుకున్న సమంత కు ఈ ఏడాది కూడా కలిసొచ్చింది. ముందుగా తమిళంలో సూపర్ డీల‌క్స్‌తో సూపర్ హిట్ కొట్టిన సామ్‌ ఈ ఏడాది తెలుగులో భర్తతో కలిసి చేసిన సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకుంది. పెళ్లి తర్వాత భార్యాభర్తలు అయినా చైతు, సామ్ నటించిన తొలి సినిమా కావడంతో ఆ ప్రభావం కూడా ఈ సినిమా సూపర్ హిట్ కు కొంత వరకు కలిసి వచ్చింది.


మజిలీ సినిమాలో భార్య భర్తల మధ్య అనుబంధాన్ని దర్శకుడు శివ నిర్వాణ చక్కగా తెరపై ప్రజెంట్ చేశాడు. ఈ పాత్రలో సామ్ మరే హీరోయిన్ చేసిన ఆ ఆ పాత్రకు అంత మంచి పేరు వచ్చేది కాదు. అలాగే మజిలీ సినిమా కూడా అంత సూపర్ హిట్ అయ్యేది కాదు.. ఈ వాస్తవాన్ని అందరూ అంగీకరించాల్సిందే. ఇంకా చెప్పాలంటే మజిలీ చైతు కెరీర్లోనే సోలో సినిమాగా చూస్తే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా చెప్పాలి. మజిలీ తర్వాత సమంత త్వరలోనే నందిని రెడ్డి డైరెక్షన్లో ఓ బేబీ, 96 రీమేక్, మన్మ‌థుడు 2 సినిమాల్లో కనిపించనుంది.


పెళ్లి తర్వాత కూడా సామ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.  అందుకు ఆమెకు వరుసగా వస్తున్న ఆఫర్స్ నిదర్శనం. వరుస ఆఫర్లతో సామ్‌ తన రెమ్యూనరేషన్ బాగా పెంచేసి నట్టు టాలీవుడ్ సర్కిల్స్ లో చర్చలు నడుస్తున్నాయి. ఏ హీరోయిన్ కైనా పెళ్లి తర్వాత అంత క్రేజ్ వుండదు కానీ సామ్ కు మాత్రం అంతకు మించిన క్రేజ్‌ వచ్చింది. వయసు పెరుగుతున్నా నయనతారకు ఎలాంటి ఇమేజ్ వచ్చిందో ఇప్పుడు సామ్‌కు సైతం అలాంటి ఇమేజ్ వచ్చింది. ప్రస్తుతం సమంత ఒక్కో సినిమాకు మూడు కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తోందట. నిర్మాతలు మాత్రం ఆమె ఎంత అడిగిన ఇచ్చేందుకు కూడా రెడీ గా ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే చాలామంది ప్రేక్షకులు సామ్ కోస‌మే సినిమాలకు వెళుతుండటం కూడా ఆమెకు ఉన్న క్రేజ్ ను చెబుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: